News October 16, 2024
నాయకత్వ లోపంతో హైదరాబాద్‌లో BJP ఓటమి: ఎంపీ అర్వింద్
నాయకత్వ లోపంతోనే హైదరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. GHMC ఎన్నికల్లో 48 చోట్ల గెలిచిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లో ఒక్క సీటుకు మాత్రమే ఎందుకు పరిమితమైందని ప్రశ్నించారు. బీజేపీలో సమన్వయ లోపం ఉందన్నారు.
Similar News
News December 21, 2024
NZB: ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు
NZBలోని కాకతీయ విద్యాసంస్థలో ఓ విద్యార్థి సూసైడ్ చేసుకొని మృతి చెందిన ఘటన మరవకముందే మరో వివాదం చోటుచేసుకుంది. సుభాష్ నగర్ బ్రాంచ్‌లో 8th క్లాస్ విద్యార్థి టాయిలెట్‌కు వెళ్లి హడావిడిలో ప్యాంట్ జిప్ పెట్టుకోవడం మర్చిపోయాడు. దీంతో అతడిని తరగతి గదిలో టీచర్ స్టేజిపైకి ఎక్కించి అవమానించడంతో విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
News December 21, 2024
NZB: షాపు ఇప్పిస్తానని రూ. 25 లక్షలు వసూలు.. అరెస్ట్
HYDలో షాపు ఇప్పిస్తానని రూ.25 లక్షలు వసూలు చేసి మోసగించిన నిందితుడిని 4 వ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలిలా..వినాయక్‌నగర్‌కు చెందిన ఓ మహిళకు HYDలోని జూబ్లీహిల్స్‌లో షాపు ఇప్పిస్తానని నమ్మించి మహబూబ్‌నగర్ (D) వాసి అహ్మద్‌ఖాన్ అనే వ్యక్తి రూ.25 లక్షలు వసూలు చేసి మోసం చేశాడు. దీంతో భాదితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
News December 20, 2024
NZB: కేసీఆర్ బిడ్డలకు పోరాటాలు కొత్తకాదు: కవిత
ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపుతున్నందుకు కేటీఆర్‌పై అక్రమ కేసు పెడుతున్నారని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. శుక్రవారం మండలి వద్ద నిరసన చేపట్టిన అనంతరం ఆమె మాట్లాడారు. కేసీఆర్ బిడ్డలకు పోరాటాలు కొత్తకాదన్నారు. ఎలాంటి కేసులైనా ధైర్యంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భయానక వాతావరణం కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని ఆమె ఆరోపించారు.