News December 20, 2025

నాయకులారా? ఈ సమస్య మీకు కనిపించట్లేదా?

image

అమ్మాయిలు, మహిళలు బయటకు వెళ్తే గుక్కెడు నీళ్లు తాగేందుకూ భయపడతారు. ఎక్కడ యూరిన్ వస్తుందేమోనని వాళ్ల భయం. ఎందుకంటే మన దేశంలో సరిపడా టాయిలెట్స్ ఉండవు. ఉన్నా క్లీన్‌గా ఉండవు. దీంతో అతివలు గంటల కొద్దీ బిగపట్టుకుని కూర్చుంటున్నారు. ఫలితంగా అనారోగ్యం బారిన పడి <<18616284>>ప్రాణాల<<>> మీదకు తెచ్చుకుంటున్నారు. ఇంతపెద్ద సమస్య మన నాయకులకు ఇప్పటికీ చిన్నగానే కనిపిస్తుంది. ఇప్పుడైనా మారతారేమో చూద్దాం.

Similar News

News January 1, 2026

తిరుమలకు వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్

image

AP: తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అలిపిరి టోల్ గేట్ నుంచి తిరుపతి గరుడ జంక్షన్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. కాగా లక్కీ డిప్ టోకెన్లు ఉన్నవారికి నేటితో దర్శనాలు ముగియనున్నాయి. రేపటి నుంచి జనవరి 8 వరకు టోకెన్లు లేని భక్తులను కూడా దర్శనానికి అనుమతించనున్నారు.

News January 1, 2026

2026: బీఆర్ఎస్ సెటైరికల్ ట్వీట్

image

TG: 2026లోకి అడుగుపెడుతున్నామని చెబుతూ ఒక్కో అంకెకు ఒక్కో వివరణ ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై BRS సెటైరికల్ ట్వీట్ చేసింది. ‘2 – రెండేండ్ల సమయం వృథా, 0 – కాంగ్రెస్ అందించిన సంక్షేమ ఫలాలు గుండు సున్నా, 2 – కాంగ్రెస్ ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలేవి?, 6- ఇస్తామన్న గ్యారంటీలు ఎక్కడ?’ అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించింది. ఎన్నెన్నో హామీలిచ్చి, మాయమాటలతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని దుయ్యబట్టింది.

News January 1, 2026

మినుములో మారుకా మచ్చల పురుగు నివారణ(1/2)

image

మినుము పంట పూత దశలో (35 రోజుల) తప్పనిసరిగా పైరుపై లీటరు నీటిలో 5% వేప గింజల కషాయం లేదా వేపనూనె 5ml కలిపి పిచికారీ చేస్తే రెక్కల పురుగులు గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. వీటి పిచికారీతో మొక్కలపై ఉన్న గుడ్లు కూడా పగిలి చనిపోతాయి.
☛ మొగ్గ, పూత దశలో పిల్ల పురుగులు కనిపిస్తే క్లోరిపైరిఫాస్ 2.5ml లేదా థయోడికార్బ్ 1 గ్రా. లేదా ఎసిఫేట్ 1 గ్రామును లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.