News September 17, 2025

నాయకులారా చూడండి.. ఇదీ ఆదిలాబాద్‌లో పరిస్థితి..!

image

నిజాం పాలన నుంచి విముక్తి పొందిన రోజంటూ అన్ని పార్టీల నాయకులు, అధికారులు గొప్పగా ఉత్సవాలు చేసుకున్నారు. కానీ ప్రజా సమస్యలు మాత్రం ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయన్న దానికి ఈ ఘటనే నిదర్శనం. ఉట్నూర్(M) సుంగు మత్తడిగూడ వాసి కుమ్ర పారుబాయి(45) అనారోగ్యంతో చనిపోయింది. ఆ ఊరిలో బ్రిడ్జి లేక వాగులో ఒకరినొకరు పట్టుకుని ఈరోజు ఆమె మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్లిన ఘటన కంటతడి పెట్టిస్తోంది.

Similar News

News September 18, 2025

ఇల్లంతకుంట: ఉపాధ్యాయుడిలా మారిన కలెక్టర్

image

సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉపాధ్యాయుడిలా మారారు. ఇల్లంతకుంట మండలం రహీంఖాన్పేట మోడల్ స్కూలును బుధవారం ఆయన తనిఖీ చేశారు. కాసేపు ఉపాధ్యాయుడిలా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. అన్ని సబ్జెక్టుల పాఠ్యాంశాలను విద్యార్థులతో నిత్యం చదివించి రాయించాలన్నారు. విద్యాలయం ఆవరణ నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. పాఠ్యాంశాలపై పట్టు వచ్చేలా పిల్లలకు బోధించాలన్నారు.

News September 18, 2025

వర్షపు నీటిని పొదుపు చేయాలి: ఆసిఫాబాద్ కలెక్టర్

image

భూగర్భ జలాన్ని అభివృద్ధి చేసేందుకు వర్షపు నీటిని పొదుపు చేయాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో భూగర్భ నీటి వనరుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టుకుని, భూమిలో ఇంకేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటిని ప్రజలు పొదుపుగా వినియోగించాలన్నారు.

News September 18, 2025

ప్రతి విద్యార్థి అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాలి

image

ప్రతి విద్యార్థి అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఇల్లంతకుంట మండలం రహీంఖాన్పేట గ్రామంలోని తెలంగాణ మోడల్ పాఠశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులు పరిశీలించి, విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్న తీరును, మధ్యాహ్న భోజనం, పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణపై ఆరా తీశారు.