News September 26, 2024

నాయుడుపేటలో గంజాయి కలకలం

image

నాయుడుపేట పట్టణ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రాంతానికి చెందిన వంతల వెంకట్రావును పట్టుకున్నట్లు సీఐ బాబి వెల్లడించారు. అతని బ్యాగులో నాలుగు కేజీల గంజాయి అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. గంజాయి ఎక్కడి నుంచి తెస్తున్నాడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అనే విషయాలపై విచారిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News February 25, 2026

వలేటివారిపాలెం: జనార్ధన స్వామి ఆలయంలో గుప్త నిధుల తవ్వకాలు

image

వలేటివారిపాలెం – చుండి మధ్య 167బి జాతీయ రహదారి పక్కనే ఉన్న జనార్ధన స్వామి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాత్రి తవ్వకాలు చేపట్టారు. ఆలయ పక్కన ఉన్న మండపంలో సుమారు 10 అడుగుల లోతున గుంత తీయడం స్థానికంగా కలకలం రేపింది. గతంలోనూ ఇలాంటి ఘటనలు రెండు మూడు సార్లు జరిగాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. చారిత్రక దేవాలయాలను కాపాడాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

News February 25, 2026

ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షల కేంద్రాలను కలెక్టర్ హిమాన్సు శుక్లా తనిఖీ చేశారు. నగరంలోని డీకే డబ్ల్యూ కళాశాలలో విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తున్నారో పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా పరీక్షలను నిర్వహించాలని ఇన్విజిలేటర్లకు ఆయన సూచించారు. విద్యార్థుల సందేహాల కొరకు ఐఆర్‌ఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు.