News February 12, 2025

నాయుడుపేటలో వ్యభిచార గృహంపై దాడి 

image

నాయుడుపేట పట్టణంలోని టీచర్స్ కాలనీలో వ్యభిచార గృహం నడుస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. పట్టణ సీఐ బాబి ఆధ్వర్యంలో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. నెల్లూరు పట్టణానికి చెందిన ఓ మహిళ నాయుడుపేటలో ఓ ఇంటిని బాడుగకు తీసుకొని బయట ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News December 22, 2025

గద్వాల: ఈనెల 24న ‘మీ డబ్బు-మీ హక్కు’ కార్యక్రమం

image

క్లెయిమ్ చేసుకోని ఆర్థిక ఆస్తుల కోసం ఈనెల 24న గద్వాల ఐడీఓసీలో ‘మీ డబ్బు-మీ హక్కు’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బి.ఎం.సంతోష్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇది జరుగుతుందని పేర్కొన్నారు. 10 ఏళ్లుగా బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల వివరాలను ఆర్‌బీఐ ‘ఉద్గమ్’ (https://udgam.rbi.org.in) వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చని సూచించారు.

News December 22, 2025

ఎస్పీ గ్రీవెన్స్‌కు 32 ఫిర్యాదు: ADB ఎస్పీ

image

పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి 32 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలిచ్చి వాటిని వెంటనే పరిష్కరించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాల ఫిర్యాదు కోసం ప్రజలు 8712659973 నంబర్‌కు వాట్సప్ ద్వారా సమాచారం అందజేయాలని వివరించారు.

News December 22, 2025

లోక్ అదాలత్‌లో 4,589 కేసులు పరిష్కారం: ఎస్పీ

image

జాతీయ మెగా లోక్ అదాలత్‌లో 4589 కేసులు పరిష్కారం అయ్యాయని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన క్యాలెండర్ కేసులు-383, డ్రంక్&డ్రైవ్-3098, ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు, ఈ-పెట్టి కేసులు-1117 తదితర కేసులు మొత్తం 4589 కేసులు పరిష్కారం అయ్యాయని అన్నారు. రాజీ మార్గమే రాజ మార్గమని, లోక్ అదాలత్ గురించి వారం రోజులుగా పోలీసు సిబ్బంది కృషి చేశారని కొనియాడారు.