News July 15, 2024
నాయుడుపేట గురుకులం ప్రిన్సిపల్, వార్డెన్ సస్పెండ్

నాయుడుపేట గురుకులం విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపల్ దాదాపీర్, వార్డెన్ విజయభాస్కర్‌ను కలెక్టర్ వెంకటేశ్వర్ సస్పెండ్ చేశారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు చికిత్స అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రకళపై మండిపడ్డారు. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి చికిత్స అందించాల్సిన వైద్యులు అందుబాటులో లేకపోవడం ఏంటని ప్రశ్నించారు.
Similar News
News February 28, 2026
వైద్యాధికారులకు నోటీసులు పంపుతాం: DMHO

స్కానింగ్ రెన్యువల్ చేయని సీహెచ్సీలు స్కానింగ్ సెంటర్లకు నోటీసులు జారీ చేసేందుకు తీర్మానించినట్లు జిల్లా వైద్యాధికారి సుజాత తెలిపారు. జిల్లాస్థాయి సలహా సంఘంతో పిండ, లింగ నిర్ధారణపై జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్కానింగ్ రెన్యువల్‌లో నిర్లక్ష్యంగా ఉన్న వెంకటాచలం, ఉదయగిరి సీహెచ్సీలకు, మార్పు చేయుటలో నిర్లక్ష్యంగా ఉన్న పొదలకూరు, కావలి ఫోకస్ డయాగ్నస్టిక్ సెంటర్‌కు నోటీసులు జారీ చేస్తామన్నారు.
News February 28, 2026
అల్లు అర్జున్ ఫాన్స్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా సనత్

నెల్లూరు జిల్లా అల్లు అర్జున్ ఫాన్స్ అసోసియేషన్ నూతన కమిటీని శనివారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఏ.సనత్ కుమార్, ఉపాధ్యక్షుడిగా పి.సాయి కుమార్ పేర్లును రాష్ట్ర అధ్యక్షుడు శివ శంకర్ ప్రటించారు. వీరితో 10మంది సభ్యులుగా నియమించారు.
News February 28, 2026
గూడూరు: శ్రీచైతన్య స్కూల్ ప్రిన్సిపల్ సూసైడ్.. కారణం ఇదే!

గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం కలవకొండకు చెందిన బూదురు సునీల్ కుమార్ <<19259093>>ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. పొదలకూరులోని శ్రీచైతన్య స్కూల్లో ఆయన ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. ఏమైందో ఏమో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నా చావుకు శ్రీచైతన్య స్కూల్ ఏజీఎం నర్ర శ్రీకాంత్ వేధింపులే కారణం. నా పిల్లలను ఐఏఎస్, ఐపీఎస్ చదివించాలన్నదే నా చివరి కోరిక’ అంటూ ఆయన సూసైడ్ లెటర్ రాశారు.


