News September 20, 2025
నాయుడుపేట: పిడుగుపాటుకు వ్యక్తి మృతి

పిడుగుపాటుకు వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం నాయుడుపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కల్లిపేడు పంచాయతీకి చెందిన శివయ్య(34) ఇంటి ఆవరణలో ఉన్న గడ్డివాములో పనిచేస్తూ ఫోన్‌లో మాట్లాడుతుండగా ఒక్కసారిగా పిడుగు పడింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. శివయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News September 20, 2025
అందంగా ఉందని ఉద్యోగం ఇవ్వట్లేదు!

నైపుణ్యం, అర్హతలున్నా 50 ఇంటర్వ్యూల్లో విఫలమైనట్లు బ్రెజిల్‌కు చెందిన 21 ఏళ్ల యువతి అలే గౌచా చేసిన పోస్ట్ వైరలవుతోంది. తాను nanny(కేర్ టేకర్) పోస్ట్‌కి అప్లై చేశానని ఆమె పేర్కొంది. అందంతో పాటు ఆకర్షణీయంగా ఉండటంతో ఎవరూ నియమించుకోవట్లేదని వాపోయింది. వివాహేతర సంబంధాలు తలెత్తుతాయని ఇంట్లోని మహిళలు భయపడుతున్నారని ఆమె చెబుతోంది. ఉద్యోగం రాకపోవడంతో కంటెంట్ క్రియేటర్‌గా(అడల్ట్) మారినట్లు ఆమె పేర్కొంది.
News September 20, 2025
గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలి: కలెక్టర్ హనుమంతరావు

గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, వాటి అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ప్లాన్‌పై ఆయన గూగుల్ మీట్‌లో సమీక్ష నిర్వహించారు. పంచాయతీల డెవలప్‌మెంట్ ప్లాన్‌లను తయారు చేసి, ఈ-గ్రామ్ స్వరాజ్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
News September 20, 2025
వరంగల్: మంత్రి.. ఎమ్మెల్యే.. ఓ రావణుడు..!

జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్న ఇప్పుడు తలనొప్పిగా మారింది. ఇటీవల ప్రజాపాలన దినోత్సవంలో మంత్రుల స్థానాలను మార్చి జెండాలను ఎగరవేశారు. ప్రస్తుతం దసరా సందర్భంగా వర్ధన్నపేట నియోజకవర్గంలోని 14వ డివిజన్‌లో నిర్వహించే రావణవధ కార్యక్రమం కొత్తచిక్కులు తెచ్చింది. నిర్వహించేది మంత్రి సురేఖ అనుచరులైతే, స్థలం మాత్రం ఎమ్మెల్యే నాగరాజు పరిధిలో ఉంది. దీంతో ప్రాధాన్యతపై చిక్కులు ఏర్పడ్డాయి.