News February 17, 2025
నాయుడుపేట రైల్వేస్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

నాయుడుపేట రైల్వే స్టేషన్‌లో ఇవాళ ఉదయం గుర్తు తెలియని మృతదేహాన్ని రైల్వే సిబ్బంది గుర్తించారు. చెన్నై వైపు వెళ్లే రైల్వే ట్రాక్ పక్కన ఈ మృతదేహం పడి ఉన్నట్టు గుర్తించారు. మృతుడి కుడి చేయి తెగినట్లు తెలుస్తోంది. ట్రైన్‌లో నుంచి ప్రమాదవశాత్తు జారి పడినట్టు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 21, 2025
‘ఘోస్ట్’ స్కూల్స్.. టాప్‌లో బెంగాల్, TG!

మన దేశంలో 5,149 ప్రభుత్వ పాఠశాలలు ఒక్క స్టూడెంట్ కూడా లేకుండా ‘ఘోస్ట్ స్కూల్స్’గా మారాయి. ఇలాంటి 70% స్కూల్స్ తెలంగాణ, వెస్ట్ బెంగాల్లోనే ఉన్నాయి. TGలోని అన్ని జిల్లాల్లోనూ జీరో ఎన్‌రోల్‌మెంట్ స్కూల్స్ ఉండటం ఆందోళనకరం. ప్రైవేట్ స్కూల్స్ వైపు మొగ్గు, పట్టణ ప్రాంతాలకు వలస, ప్రభుత్వాల ప్రణాళికా లోపమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. పిల్లలు లేకపోయినా బడ్జెట్ మాత్రం కేటాయిస్తున్నారు.
News December 21, 2025
NZB: GP ఎన్నికల్లో నకిలీ నోట్లు?

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నకిలీ నోట్ల కలకలం రేపుతోంది. వర్ని కెనరా బ్యాంకులో ఓ వ్యక్తి రూ.2.08 లక్షల నకిలీ నోట్లు తీసువచ్చిన విషయం తెలిసిందే. బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కామారెడ్డిలో ఓ వైన్స్ షాపులో నకిలీ రూ.500 నోట్లు మార్చే ముఠాలోని ఇద్దరు నిందితులపై PD యాక్ట్ నమోదు చేశారు. GP ఎన్నిల్లో దొంగనోట్లు పంపిణీ చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హాట్ టాపిక్‌గా మారింది.
News December 21, 2025
జనవరి 10 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు

జిల్లాలో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు జనవరి 1నుంచి 13 వరకు నిర్వహించనున్నట్లు DEO అశోక్ తెలిపారు. డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ అభ్యర్థులకు ఈ పరీక్షలు జరుగుతాయి. ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. టైలరింగ్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ సొంత కుట్టు మిషన్లను తెచ్చుకోవాలన్నారు. అభ్యర్థులందరూ నిర్ణీత సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు.


