News November 11, 2025
నాయుడుపేట సెజ్‌లో రూ.3,038 కోట్ల పెట్టుబడి.. 2,265 మందికి జాబ్స్

మంత్రివర్గ సమావేశంలో CM చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో నాయుడుపేట సెజ్‌లో పలు కంపెనీలు పెట్టుబడి పెట్టనున్నాయి. ఏపీటోమ్ కాంపోనెంట్స్ రూ.700 కోట్ల పెట్టుబడితో PCBలు, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. వాల్ట్సన్ LABS రూ.1,743 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. గ్రీన్‌లామ్ సౌత్ లిమిటెడ్ రూ.595 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేయనుంది.
Similar News
News November 11, 2025
నా పేరు మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్: ఎస్పీ నరసింహ

తన పేరుపై నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేశారని దానికి ఎవరూ స్పందించవద్దని ఎస్పీ నరసింహ జిల్లా ప్రజానీకాన్ని కోరారు. సైబర్ మోసగాళ్లు एसपी सूर्यपेट (SP Suryapet) పేరుతో ఒక నకిలీ ఫేస్ బుక్ ప్రొఫైల్ క్రియేట్ చేశారన్నారు. ఆ అకౌంట్ నుంచి వచ్చే మేసేజ్‌లకు స్పందించవద్దని కోరారు. డబ్బులు అడిగినా పంపవద్దని చెప్పారు.
News November 11, 2025
నిర్మల్: ఈనెల 13 నుంచి జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు

జిల్లాలోని యువత ప్రతిభను గుర్తించేందుకు ఈనెల 13 నుంచి నిర్మల్ ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జిల్లా స్థాయి యువజన ఉత్సవాల్లో భాగంగా పలు అంశాల్లో పోటీలను నిర్వహించనున్నట్లు డీవైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. 15 నుంచి 29 ఏళ్లలోపు వయసు కల వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన యువతీ యువకులు ఈ నెల 13న ఎన్టీఆర్ మినీ స్టేడియంలో వివరాలతో హాజరు కావాలని కోరారు.
News November 11, 2025
క్లౌడ్ స్కిన్ మేకప్ గురించి తెలుసా?

మేకప్ ఇప్పుడు ప్రతి అమ్మాయి రొటీన్‌లో భాగమైపోయింది. వాటిల్లో కొత్తగా వచ్చిందే ఈ క్లౌడ్ స్కిన్ మేకప్. అన్నిరకాల చర్మతత్వాలకు సరిపడే ఈ మేకప్‌లో ముందుగా సీరమ్, తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. పోర్ బ్లరింగ్ ప్రైమర్, ఫౌండేషన్ అద్దుకోవాలి. తర్వాత బ్లష్, మ్యాట్ ఫినిష్ బ్రాంజర్ రాసుకోవాలి. అంతే మ్యాట్ ఫినిష్‌తో వచ్చే మేకప్ పూర్తయినట్లే. మ్యాట్ ఫినిష్ లిప్‌స్టిక్ వేసుకుంటే ఇంకా బావుంటుంది.


