News June 18, 2024
నాయుడుపేట: హైవేపై రోడ్డు ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్
నాయుడుపేట మండలం పండ్లూరు జాతీయ రహదారిపై నట్టేటి చెంగయ్య (70)ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామ సమీపంలోని పంట పొలాల వద్దకు నడిచి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News January 19, 2025
ఇవాళ సూళ్లూరుపేటకు రానున్న ప్రముఖులు వీరే
సూళ్లూరుపేటలో ఆదివారం ఫ్లెమింగో ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు నేడు సూళ్లూరుపేటకు రానున్నారు. వారిలో నటి, యాంకర్ అనసూయ, అషు రెడ్డి, యాంకర్ రేణు, సింగర్ గాయత్రి, రఘురామ్, కొరియోగ్రాఫర్ సత్య, చైల్డ్ సింగర్ సాయి వాగ్ దేవి, మిమిక్రీ ఆర్టిస్ట్ షరీఫ్ తదితరులు ఉన్నారు.
News January 19, 2025
HYD ఓయో రూమ్‌లలో ఉంటూ గంజాయి వ్యాపారం
హైదరాబాదు ధూల్‌పేట జాలీ హనుమాన్ దేవాలయం వద్ద ఎక్సైజ్ పోలీసులు దాడులు జరిపారు. వారు మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌కి చెందిన సంజన మాంజా(18), నెల్లూరు జిల్లా కావలికి చెందిన రాజు(25) ఓయో రూమ్‌లలో అద్దెకు ఉంటూ గంజాయి వ్యాపారం చేస్తున్నారని వారు తెలిపారు. పక్కా సమాచారంతో దాడి చేసి వారిని పట్టుకున్నామన్నారు. వారి వద్ద నుంచి 3.625 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
News January 19, 2025
నెల్లూరు: పెరుగుతున్న నిమ్మ ధరలు.. రైతుల్లో ఆనందం
రెండు రోజుల నుంచి నిమ్మ ధరలు ఊపందుకున్నాయి. ఇటీవల చలి ప్రభావం ఎక్కువ ఉండడంతో ధరలు ఆశించినంతగా లేక రైతులు ఆందోళన చెందారు. గూడూరు మార్కెట్లో కిలో నిమ్మకాయలు రూ. 25 నుంచి రూ. 35 వరకు పలుకుతున్నాయి. నాణ్యత కలిగిన నిమ్మకాయలు రూ. 45 పలుకుతున్నట్లు రైతులు చెబుతున్నారు. 50 కేజీల లూజు బస్తా రూ. 2,400 నుంచి 3,300 వరకు అమ్ముతున్నారు. నిమ్మ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.