News March 16, 2025
నారపల్లి: పాత నాణేల మాయ.. మోసపోయిన మహిళ

పాత నాణేలు విక్రయిస్తే రూ.లక్షలు వస్తాయని నమ్మబలికి ఓ మహిళను నట్టేట ముంచారు. పోలీసుల ప్రకారం.. పాత నాణేలు విక్రయిస్తే రూ.46 లక్షలు వస్తాయని ఓ మహిళను నమ్మించారు. ప్రాసెసింగ్ ఫీజ్, ట్యాక్స్, సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో ఆమె నుంచి ₹1.36 లక్షలు లూటీ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మోసపూరిత ప్రకటనలతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
Similar News
News December 21, 2025
ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గింది: KCR

TG: ఒకప్పుడు యూరియా ఇంటికి, చేను వద్దకు వచ్చేదని, ఇప్పుడు కుటుంబమంతా లైన్‌లో నిలబడే పరిస్థితి వచ్చిందని కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకం ప్రకటించకపోగా ఉన్న వాటిని ఆపేసిందన్నారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గిందని BRS సమావేశంలో తెలిపారు. రైతులకు నీటిని అందించేందుకు నిర్మించిన చెక్‌డ్యామ్‌లను పేల్చివేస్తున్నారని మండిపడ్డారు.
News December 21, 2025
త్వరలో ‘ఆంధ్రా టాక్సీ’ యాప్

AP: ప్రైవేట్ క్యాబ్ సంస్థల అధిక ఛార్జీలకు చెక్ పెట్టేందుకు ‘ఆంధ్రా టాక్సీ’ పేరుతో ప్రభుత్వం కొత్త యాప్‌ను తీసుకొస్తోంది. తక్కువ ధరకే ఆటో, టాక్సీ సేవలు అందించడమే లక్ష్యంగా దీనిని రూపొందించారు. తొలుత NTR జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా సేవలు ప్రారంభించనున్నారు. దీంతో పర్యాటక ప్రాంతాలకు తక్కువ ధరతో ప్రయాణించొచ్చు. ఈ యాప్‌ను NTR జిల్లా యంత్రాంగమే పర్యవేక్షిస్తుందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
News December 21, 2025
నెల్లూరు TDPలో BCల హవా..!

పార్టీ ఏదైనా నెల్లూరు రాజకీయాల్లో రెడ్డి సామాజికవర్గ నేతలు కీలకంగా వ్యవహరిస్తుంటారు. TDP ట్రెండ్ మార్చి బీసీలకు ప్రాధాన్యమిస్తోంది. TDP జిల్లా అధ్యక్ష పదవికి పెళ్లకూరు శ్రీనివాసుల రెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి మరికొందరు గట్టిగా ప్రయత్నించారు. కానీ MLC బీద రవిచంద్రకు మూడోసారి ఈ పదవిని అప్పగించారు. నెల్లూరు ఇన్‌ఛార్జ్ మేయర్‌గా రూప్ కుమార్, రాజ్యసభ ఎంపీగా బీద మస్తాన్ రావు ఉన్న విషయం తెలిసిందే.


