News February 4, 2025

నారాయణఖేడ్: ఇరు వర్గాల ఘర్షణ.. 10 మందికి గాయాలు

image

నారాయణఖేడ్ మండలం బానాపూర్‌లో జరిగిన ఘర్షణలో 10 మంది గాయపడ్డారు. స్థానికుల సమాచారం.. బాణాపురం గ్రామస్థులు, పక్కనే ఉన్న బుడగ జంగాల కాలనీకి చెందిన కొందరు 4 రోజుల క్రితం జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకొని రాళ్లు, కర్రలతో పరస్పర దాడులకు పాల్పడ్డారు. దాడుల్లో ఇరు వర్గాలకు చెందిన 10 మంది గాయపడ్డారు. పోలీసులు ఘటనాకి చేరుకొని పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చి, ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు.

Similar News

News September 17, 2025

OG టికెట్ ధరలు భారీగా పెంపు

image

పవన్ కళ్యాణ్ ‘OG’ మూవీ టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. ఈ నెల 25న అర్ధరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షోకు అనుమతిస్తూ టికెట్ ధరను రూ.1000గా పేర్కొంది. అంతేకాకుండా అక్టోబర్ నాలుగు వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో గరిష్ఠంగా రూ.125, మల్టీప్లెక్స్‌లలో రూ.150 వరకు టికెట్ ధరలు పెంచుకోవచ్చని తెలిపింది. మరోవైపు తెలంగాణలో టికెట్ ధరల పెంపుపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

News September 17, 2025

ఆరోగ్యశ్రీకి రూ. 44 కోట్లు ఖర్చు: కోదండ రెడ్డి

image

కామారెడ్డిలో ఆరోగ్యశ్రీ పథకం కింద 17 వేల మందికి పైగా నిరుపేదలకు వైద్య సేవలు అందించినట్లు రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి వెల్లడించారు. జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది కాలంలో శస్త్రచికిత్సలు, ఇతర వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం రూ. 44 కోట్లు వెచ్చించిందని తెలిపారు. ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వారికి నాణ్యమైన వైద్యం అందుతోందని పేర్కొన్నారు.

News September 17, 2025

నర్సంపేట: నేషనల్ స్పేస్ సొసైటీలో నిహారిక ఫస్ట్..!

image

నర్సంపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న భూక్య నిహారిక నేషనల్ స్పేస్ సొసైటీ (USA) నిర్వహించిన “Road Map to Space Art Contest” డ్రాయింగ్ విభాగంలో ప్రపంచ స్థాయి మొదటి బహుమతి సాధించింది. ఈ సందర్భంగా నర్సంపేట MLA దొంతి మాధవ రెడ్డి భూక్య నిహారికను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.