News February 4, 2026

నారాయణఖేడ్: మున్సిపల్ బరిలో బాబాయి.. అబ్బాయి

image

నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల బరిలో ఒకే కుటుంబానికి చెందిన బాబాయి, అబ్బాయి బరిలో నిలిచారు. జిల్లా ప్రణాళిక సంఘం మాజీ సభ్యులు నగేష్ కుమార్ శెట్కార్ 8వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, ఆయన సోదరుడి కుమారుడు సాగర్ శెట్కార్ 7వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఒకే పార్టీ తరఫున వేర్వేరు వార్డుల్లో పోటీ పడుతున్న ఈ బాబాయి, అబ్బాయిల ఎన్నికల ప్రచారం ఆసక్తికరంగా మారింది.

Similar News

News February 13, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 13, 2026

పవన్ ఆదేశాలతో చిన్నారులకు ఇంటి పట్టా

image

పిఠాపురం మండలం మాదాపురం గ్రామానికి చెందిన సత్య, చంటి తల్లిదండ్రులు లేకపోవడంతో డిప్యూటీ సీఎం పవన్ సార్ మమ్మల్ని ఆదుకోవాలని కోరారు. వారు విన్నవించినా వీడియోతో ఇటీవల Way2Newsలో వార్త ప్రచురితమైంది. దీనికి డిప్యూటీ సీఎం స్పందించి అండగా ఉంటానని, ఇంటి పట్టాను అందజేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం పిఠాపురం తహశీల్దార్ గోపాలకృష్ణ ఆ చిన్నారులకు ఇంటి పట్టాను ఇచ్చారు. వారు ఇద్దరూ ఆనందించారు.

News February 13, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (FEB 13, శుక్రవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.30 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.44 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.40 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.17 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.30 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.