News January 27, 2025

నారాయణపేటలో క్వింటా వేరుశనగ ధర ఎంతంటే?

image

నారాయణపేట వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం భారీగా వేరుశనగకాయ తరలి వచ్చింది.1551 క్వింటాళ్ల వేరుశనగ రాగా.. గరిష్ఠంగా రూ.5,775.. కనిష్ఠంగా రూ.3,020 ధర పలికింది. సోనారకం వరి ధాన్యం 9 క్వింటాళ్లు రాగా.. గరిష్ఠంగా రూ.1,939.. కనిష్ఠంగా రూ.1,939 ధర పలికింది. 50,69 క్వింటాళ్ల ఎర్ర రకం కందులు రాగా.. గరిష్ఠంగా రూ.7,549 కనిష్ఠంగా రూ.3,200 వరకు పలికినట్లు వ్యవసాయ మార్కెట్ అధికారి లక్ష్మణ్ తెలిపారు.

Similar News

News July 6, 2025

HYD: విద్యుత్ సమస్యలపై ప్రతి బుధవారం ముఖాముఖి

image

గ్రేటర్ HYD నగరం పరిధిలో ప్రతి బుధవారం ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించాలని ఎండి ముషారఫ్ అలీ ఆదేశించారు. విద్యుత్ శాఖ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సైతం ఉపయోగించనున్నట్లు తెలిపారు. విద్యుత్ డిమాండ్, హెచ్చుతగ్గుల గుర్తింపు, అంతరాయాల నియంత్రణ కోసం ఈ సేవలు సైతం ప్రారంభం కానున్నాయి. స్థానికంగా విద్యుత్ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

News July 6, 2025

బిహార్‌ను క్రైమ్ క్యాపిటల్‌గా మార్చేశారు: రాహుల్ గాంధీ

image

BJP, CM నితీశ్ కలిసి బిహార్‌ను భారతదేశ క్రైమ్ క్యాపిటల్‌గా మార్చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. పట్నాలో <<16949011>>గోపాల్ ఖేమ్కా హత్య<<>> ద్వారా ఇది మరోసారి రుజువైందన్నారు. ‘బిహార్‌లో నేరాలు సాధారణంగా మారినా అసమర్థ ప్రభుత్వం ఏం చేయట్లేదు. భద్రత ఇవ్వలేని వారికి మీ భవిష్యత్తును అప్పగించొద్దు. ఈసారి ప్రభుత్వాన్ని మార్చడానికి మాత్రమే కాదు.. బిహార్‌ను కాపాడేందుకు ఓటు వేయండి’ అని ట్వీట్ చేశారు.

News July 6, 2025

సిగాచీ ప్రమాదం.. 41కి చేరిన మృతుల సంఖ్య

image

TG: పాశమైలారం సిగాచీ ఫార్మా ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా జితేందర్ అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. దీంతో మృతుల సంఖ్య 41కి చేరింది. మరో 11 మంది ఆచూకీ లభించలేదు. మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.