News February 16, 2026

నారాయణపేటలో వికసించిన కమలం

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మున్సిపల్ ఛైర్మన్ స్థానం బీజేపీ దక్కించుకుంది. మొత్తం 11 మంది బీజేపీ అభ్యర్థులు గెలుపొందగా బీజేపీ రెబల్ అభ్యర్థిగా విజయం సాధించిన జయశ్రీ సొంత పార్టీలో చేరగా బలం 12కు చేరింది. దీంతో ఎంపీ డీకే అరుణ ఎక్స్ అఫీషియో ఓటుతో ఛైర్మన్ స్థానం బీజేపీ సొంతమైంది. ఛైర్‌పర్సన్‌గా కొండా శ్వేత, వైస్ ఛైర్‌పర్సన్‌గా మంజుల ప్రమాణ స్వీకారం చేశారు.

Similar News

News February 21, 2026

బడ్డీ వద్ద బజ్జీలు వేసిన హోంమంత్రి అనిత

image

ఉపమాకలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవ ఏర్పాట్లను హోంమంత్రి అనిత శనివారం పరిశీలించారు. ఆసమయంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు అక్కడే అమ్ముతున్న గారెలు, బజ్జీలను మంత్రికి తీసుకువచ్చి అందజేశారు. వాటిని రుచి చూసిన మంత్రి స్వయంగా షాప్ వద్దకు వెళ్లి కొద్దిసేపు బజ్జీలు వేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

News February 21, 2026

చీపురు పట్టిన నంద్యాల కలెక్టర్

image

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని గుర్తు చేయాల్సిన అవసరం ఉందని నంద్యాల కలెక్టర్ రాజకుమారి తెలిపారు. కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని శుభ్రత పనులను పరిశీలించారు. అనంతరం చీపురు పట్టి చెత్తను ఊడ్చారు. జీవిత విధానంలో శుభ్రతను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు.

News February 21, 2026

వికసిత్ భారత్‌కు ‘మేడ్ ఇన్ ఇండియా చిప్స్’ కీలకం: మోదీ

image

IND అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి స్వయంసమృద్ధి సాధించడం కీలకమని PM మోదీ తెలిపారు. ఫాక్స్‌కాన్, HCL యూపీలో ఏర్పాటుచేయనున్న సెమీకండక్టర్ పరిశ్రమకు వర్చువల్‌గా ఆయన శంకుస్థాపన చేశారు. ‘కరోనా టైమ్‌లో చిప్‌ల సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో అనేక ఆర్థిక వ్యవస్థలు ప్రభావితమయ్యాయి. వికసిత్ భారత్‌కు మేడ్ ఇన్ ఇండియా చిప్స్ ముఖ్యం. ఈ దశాబ్దంలో నిర్ణయాలు 21వ సెంచరీలో సామర్థ్యాలకు పునాదులవుతాయి’ అని పేర్కొన్నారు.