News January 9, 2026

నారాయణపేట్ – కొడంగల్ ఎత్తిపోతల పథకానికి రైతుల పచ్చజెండా

image

నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకానికి రైతులు పూర్తిస్థాయిలో అంగీకారం తెలిపారు. దౌల్తాబాద్ సమీపంలోని వేంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు వివిధ మండలాల రైతులు పెద్దఎత్తున హాజరయ్యారు. సుమారు రూ.4,885 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా 32 గ్రామాల్లోని 23,758 ఎకరాలకు సాగునీరు అందనుంది.

Similar News

News January 27, 2026

కామారెడ్డి: మున్సిపల్ నామినేషన్ల పర్వం.. అధికారుల అప్రమత్తత

image

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కామారెడ్డి జిల్లా నుంచి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్ విక్టర్, ఇంచార్జీ కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఏసీఎల్బీ మధుమోహన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి తదితర అధికారులు పాల్గొన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కమిషనర్ ఆదేశించారు.

News January 27, 2026

NGKL జిల్లాలో 3 మున్సిపాలిటీలు.. 80, 757 ఓటర్లు.!

image

మున్సిపల్ ఎన్నికల <<18974641>>నగారా<<>> మోగింది. నాగర్ కర్నూల్ జిల్లాలో మూడు మున్సిపాలిటీల్లో 65 వార్డులకు 131 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 80,757 మంది ఓటర్లు ఉన్నారు. NGKLలో 24 వార్డులు, 35,378 ఓటర్లు, కొల్లాపూర్‌లో 19 వార్డులు, 19,356 ఓటర్లు, కల్వకుర్తి‌లో 22 వార్డులు, 26,023 ఓటర్లు ఉన్నారు. కాగా FEB 11న పోలింగ్, 13న ఫలితాలు వెలువడనున్నాయి.

News January 27, 2026

‘యానిమల్’ సీక్వెల్‌పై రణ్‌బీర్ క్రేజీ అప్‌డేట్

image

యానిమల్ సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు రణ్‌బీర్ కపూర్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ‘యానిమల్ పార్క్’ షూటింగ్ 2027లో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు. ప్రస్తుతం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా వేరే సినిమా పనుల్లో బిజీగా ఉన్నట్లు గుర్తుచేశారు. పైగా ఆయన దీన్ని 3 పార్ట్‌లుగా ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. సీక్వెల్‌లో తాను డ్యుయల్ రోల్‌లో కనిపించే అవకాశం ఉందని చెప్పారు.