News December 31, 2025
నారాయణపేట అదనపు కలెక్టర్‌గా ఉమాశంకర్

నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్‌గా ఉమాశంకర్ ప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ప్రస్తుతం వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతేడాది సెప్టెంబరు 6న అక్కడ బాధ్యతలు చేపట్టిన ఆయన, ఉద్యోగోన్నతిపై నారాయణపేటకు రానున్నారు. ఉమాశంకర్ ప్రసాద్ బుధవారం ఇక్కడ అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
Similar News
News December 31, 2025
జగిత్యాల: పెట్రోలు పోసి హత్య కేసులో 6 మందికి జీవిత ఖైదు

జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతాపూర్ గ్రామ శివారులోని ఆశ్రమంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పవన్ కుమార్‌ను పెట్రోలు పోసి నిప్పంటించి హత్య చేసిన కేసులో ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ.10,000 జరిమానా విధిస్తూ 1వ అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి నారాయణ తీర్పు వెలువరించారు. నేరం చేసినవారు శిక్ష నుంచి తప్పించుకోలేరని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
News December 31, 2025
IIM బుద్ధ గయ 76 పోస్టులకు నోటిఫికేషన్

IIM బుద్ధ గయ 76 ఫ్యాకల్టీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి PhD, పీజీ అర్హతతో పాటు బోధన, పరిశోధనలో అనుభవం గల అభ్యర్థులు నేటి నుంచి జనవరి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రొఫెసర్‌కు నెలకు రూ.1,59,100, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,39,600, Asst. prof గ్రేడ్-1కు రూ.1,31,400, Asst. prof గ్రేడ్-2కు రూ. 89,900 చెల్లిస్తారు. వెబ్‌సైట్: iimbg.ac.in
News December 31, 2025
KNR: న్యూఇయర్ సెలబ్రేషన్‌లో నిబంధనలు కఠినం

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో సీపీ గౌష్ ఆలం ఆంక్షలు విధించారు. బుధవారం రాత్రి 8 నుంచి గురువారం ఉదయం 8 వరకు 163 బీఎన్ఎస్ఎస్ చట్టం అమలులో ఉంటుందని, ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరంలోకి భారీ వాహనాల ప్రవేశాన్ని నిషేధించారు. డీజేలు, బాణసంచా వాడకూడదని, డ్రంకెన్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్‌పై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.


