News April 6, 2025
నారాయణపేట: ఆరుగురిపై కేసు నమోదు

నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల శివారులో కొంత మంది జూదం ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్, ఉట్కూరు పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురిని పట్టుకుని వారి వద్ద నుంచి రూ.7,700 నగదు, 6 సెల్‌ఫోన్లు, 3 బైక్‌లు, పేకముక్కలు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించామని ఎస్ఐ కృష్ణంరాజు శనివారం తెలిపారు. గేమింగ్ యాక్ట్ ప్రకారం ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Similar News
News April 6, 2025
తెలంగాణకు అన్యాయం జరగనివ్వం: ఉత్తమ్

TG: కృష్ణా, గోదావరి జలాలపై ఈ నెల 15, 16, 17 తేదీల్లో జరిగే న్యాయవిచారణకు తాను హాజరవుతానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జలవివాదాలపై వాదనలు వినిపిస్తున్న న్యాయబృందంతో ఆయన చర్చలు జరిపారు. ‘నీటి కేటాయింపులు సరిగ్గా లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగేలా ఉన్న నిర్ణయాలను సరిచేస్తాం. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో ఒక్క అవకాశం కూడా వదులుకోం’ అని ఉత్తమ్ స్పష్టం చేశారు.
News April 6, 2025
నిజాంపట్నం: కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి

రొయ్యల చెరువులో ఫ్యాన్ తిరగకపోవడంతో పరిశీలించడానికి వెళ్లి వెంకటరెడ్డి మృతి చెందిన ఘటన ఆదివారం నిజాంపట్నంలో చోటుచేసుకొంది. స్థానికుల వివరాల మేరకు.. కర్లపాలెం మండలం పెదపులుగు వారిపాలెం గ్రామానికి చెందిన వెంకటరెడ్డి నిజాంపట్నంలో రొయ్యల చెరువు వద్ద పనిచేస్తుంటాడు. చెరువులో ఫ్యాన్ తిరగకపోవడంతో పరిశీలించడానికి వెళ్లిన ఆయన కరెంట్ షాక్‌కు గురై మృతి చెందాడు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News April 6, 2025
రిటైర్మెంట్ ప్రచారంపై స్పందించిన ధోనీ

IPLకు తాను రిటైర్మెంట్ ప్రకటిస్తానని జరుగుతున్న ప్రచారంపై CSK స్టార్ ప్లేయర్ MS ధోనీ స్పందించారు. ‘ప్రస్తుతం నాకు 43 ఏళ్లు. ఇంకా ఆడుతున్నాను. ఈ జులై నాటికి నాకు 44 ఏళ్లు వస్తాయి. తదుపరి సీజన్ ఆడాలా, వద్దా? అనేది నిర్ణయించుకునేందుకు మరో 10 నెలల సమయం ఉంది. ఆడగలనా, లేదా? అనేది నిర్ణయం శరీరం అందించే సహకారం బట్టి తీసుకుంటా’ అని రాజ్ షమానీతో జరిగిన పాడ్‌కాస్ట్‌లో MSD వెల్లడించారు.