News April 14, 2025

నారాయణపేట: ఎకరానికి రూ.40 వేలు నష్టపరిహారం అందించాలి: శ్రీనివాస్ గౌడ్

image

నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం గోర్లోనిబావి గ్రామంలో లో వోల్టేజ్ కరెంటుతో ఎండిపోయిన వరి పొలాలను మహబూబ్‌నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్యెల్యే పట్నం నరేందర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. తక్షణమే ఎకరానికి రూ.40 వేలు నష్టపరిహారంగా అందించాలని డిమాండ్ చేశారు.

Similar News

News September 15, 2025

కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తల్లి మృతి

image

కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తల్లి మృతి చెందిన ఘటన చింతలపూడి మండలం గురుభట్లగూడెంలో చోటుచేసుకుంది. కుమారుడు చక్రపు వాసు నిన్న అనారోగ్యంతో మృతి చెందడంతో తల్లి శాంతమ్మ (90) మనోవేదనకు గురయ్యారు. ఈ విషాదాన్ని భరించలేక సోమవారం ఆమె తుదిశ్వాస విడిచారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకొన్నాయి.

News September 15, 2025

SRCL: ‘గ్యాస్ స్టవ్ పైనే విద్యార్థులకు ఆహారం వండాలి’

image

గ్యాస్ స్టవ్ పైనే విద్యార్థులకు ఆహార పదార్థాలను సిద్ధం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడ మండలం చింతల్ఠాణా ఆర్&ఆర్ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పూర్తి చేసిన కిచెన్ షెడ్, విద్యాలయ ఆవరణను ఈ సందర్భంగా ఆయన పరిశీలించారు. విద్యాలయ ఆవరణలో నీరు నిలవకుండా, పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బిందికి సూచించారు.

News September 15, 2025

పార్వతీపురం: ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌కు 10 అర్జీలు

image

పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 10 వినతులు వచ్చినట్లు ఎస్పీ అంకిత సురాణా తెలిపారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపించారు. సమస్యల నివేదక ఎస్పీ కార్యాలయానికి అందజేయాలని చెప్పారు.