News October 27, 2025

నారాయణపేట: కలవర పెడుతున్న చిరుతల మృత్యువాత

image

నారాయణపేట జిల్లాలో ఇటీవల చిరుతల మరణాలు పెరగడం జంతు ప్రేమికుల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా పేరపళ్ల గ్రామ గుట్టల ప్రాంతంలో ఓ చిరుత మృతదేహం లభ్యమైంది. మద్దూరు మండల పరిధిలో కొంతకాలంగా ఏకంగా 4 చిరుతలు మృత్యువాత పడ్డాయి. జాదవ్‌రావుపల్లె, నందిపాడు, దుప్పటి ఘాట్, మోమినాపూర్ గుట్టల్లో ఇరుక్కుని చిరుతలు మృతి చెందడంపై విచారణ చేపట్టాలని కోరుతున్నారు.

Similar News

News October 27, 2025

భారీ వర్షాలు.. చామంతిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

అధిక వర్షాల వల్ల చామంతిలో వేరుకుళ్లు, ఆకుమచ్చ తెగులు ఆశించి నష్టపరిచే అవకాశం ఉంది. పంటలో నీరు నిల్వ ఉండకుండా బయటకు పంపాలి. వేరుకుళ్లు నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లేదా విడోమిల్ ఎంజడ్ 2.5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. అలాగే ఆకుమచ్చ తెగులు నివారణకు లీటరు నీటికి కార్బండిజమ్ ఒక గ్రాము మరియు మ్యాంకోజబ్ 2.5 గ్రా. లేదా లీటరు నీటికి హెక్సాకోనోజోల్ 2ml కలిపి పిచికారీ చేయాలి.

News October 27, 2025

కృష్ణా జిల్లాలో 188 రిలీఫ్ క్యాంప్‌లు

image

మొంథా తుపాన్ నేపథ్యంలో కృష్ణాజిల్లాలో 188 పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 670 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. మచిలీపట్నం డివిజన్ లో 93 కేంద్రాలు ఏర్పాటు చేయగా 534 మందిని, ఉయ్యూరు డివిజన్‌లో 61 కేంద్రాలకు గాను 141 మందిని తరలించారు. గుడివాడ డివిజన్‌లో 34 కేంద్రాలు ఏర్పాటు చేయగా ఒక్కరిని కూడా తరలించలేదు.

News October 27, 2025

డౌన్ సిండ్రోమ్ లక్షణాలివే..

image

డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లల్లో ఎదుగుదల లోపాలు కనిపిస్తాయి. మెడ వెనక భాగంలో దళసరిగా ఉండటం, చెవి డొప్పలు చిన్నగా ఉండటం, చప్పిడి ముక్కు, ఎత్తు పెరగకపోవడం, తల చిన్నగా ఉండటం, మానసిక వికాసం ఆలస్యంగా ఉండటంతో పాటు గుండె, కంటి సమస్యలు, హైపోథైరాయిడిజం వంటివీ ఉంటాయి. ఇది క్రోమోజోముల తేడా వల్ల వచ్చిన కండిషన్‌ కావడంతో దీనికి చికిత్స లేదు. కానీ నిపుణుల పర్యవేక్షణలో థెరపీలు తీసుకుంటుంటే కాస్త ఫలితం కనిపిస్తుంది.