News October 16, 2025

నారాయణపేట కలెక్టరేట్‌లో అధికారులకు CPRపై శిక్షణ

image

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నారాయణపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో CPR (Cardio Pulmonary Resuscitation)పై జిల్లా అధికారులకు ఈరోజు ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొని మాట్లాడుతూ.. “ప్రస్తుతం హార్ట్ అటాక్‌ కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో CPR ద్వారా ప్రాణాలను కాపాడవచ్చు” అని తెలిపారు.

Similar News

News October 17, 2025

NRPT: గోల్డ్ మెడల్ అందుకున్న పేదింటి అమ్మాయి

image

పాలమూరు యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవంలో భాగంగా దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామానికి చెందిన పూజారి తులసి గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ చేతుల మీదుగా ఈరోజు గోల్డ్ మెడల్ అందుకుంది. పీయూ పీజీ సెంటర్ గద్వాలలో ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ 2024 గాను పతకం అందుకుంది. 10th క్లాస్ గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకుంది. పేద కుటుంబానికి చెందిన తులసికి గోల్డ్ మెడల్ రావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News October 17, 2025

రోజుకు 5KM పరుగు… అయినా 2 స్టెంట్లు

image

రోజుకు 5 కి.మీ పరిగెత్తడం అతడి దినచర్య. నిద్ర, ఆహార నియమాలను తూ.చ పాటిస్తుంటాడు. 15 ఏళ్లుగా ఇదే పాటిస్తున్న కార్తీక్ శ్రీనివాసన్ అనే వ్యక్తి చేసిన ట్వీట్ వైరలవుతోంది. హఠాత్తుగా అస్వస్థత అనిపించడంతో యాంజియోగ్రామ్ చేస్తే హార్ట్‌లో 2 బ్లాక్స్ ఉన్నట్లు తేలిందని, స్టెంట్లు వేశారని ఆయన పేర్కొన్నాడు. జాగ్రత్తలు తీసుకున్నా గుండె లయ తప్పిందన్నాడు. గుండె ఆరోగ్యం అనేక అంశాలతో ముడిపడి ఉంటుందనుకోవాలన్నాడు.

News October 17, 2025

MHBD: ఘనంగా అవిభక్త కవలలు వీణా-వాణిల పుట్టినరోజు వేడుకలు

image

MHBD(D) దంతాలపల్లి(M) బీరిశెట్టిగూడేనికి చెందిన నాగలక్ష్మి-మురళీ దంపతుల కుమార్తెలు అవిభక్త కవలలు వీణా-వాణిల 23వ జన్మదిన వేడుకలను స్టేట్ హోమ్‌(HYD)లో గురువారం నిర్వహించారు. తమ పిల్లల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకొని తమను ఆదుకుంటుందని తల్లిదండ్రులు అన్నారు. అలాగే, వైద్యరంగంలో జరిగిన అభివృద్ధితో తమ బిడ్డలైన అవిభక్త కవలలను విడదీసి సంపూర్ణ ఆరోగ్యంతో తమకు అప్పగించాలని కోరారు.