News April 5, 2025
నారాయణపేట: ‘కార్మికులను పర్మినెంట్ చేయాలి’

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని TUCI రాష్ట్ర కార్యదర్శి సూర్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నారాయణపేట మెట్రో ఫంక్షన్ హాలులో జరిగిన గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 2వ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికులకు ప్రతి నెల వేతనాలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ, బీమా సౌకర్యం కల్పించాలని, కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Similar News
News April 6, 2025
శ్రీరామనవమికి సంగారెడ్డి జిల్లాలో పటిష్ట బందోబస్తు: ఎస్పీ

సంగారెడ్డి జిల్లాలో శ్రీరామ నవమి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు. మత సంప్రదాయాలను మరొకరు గౌరవించినప్పుడే మతసామరస్యం నెలకొంటుందని తెలిపారు. జహీరాబాద్, సదాశివపేట, సంగారెడ్డి పట్టణాలలో శ్రీరామనవమి ఏర్పాట్లు బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు.
News April 6, 2025
నాగర్‌కర్నూల్: ‘దరఖాస్తు చేసుకోండి.. మీ కోసమే ఇది’

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని నాగర్‌కర్నూల్ జిల్లాలోని బీసీ, అత్యంత వెనుకబడిన తరగతుల ఈ.బీ.సీ నిరుద్యోగ యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, అభివృద్ధి శాఖ అధికారి అలీ అప్సర్ సూచించారు. వివిధ రకాల వ్యాపారాలను నిర్వహించేందుకు దీనికి దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు.
News April 6, 2025
మహబూబ్‌నగర్: నేడు శ్రీరామకొండకు వెళ్తున్నారా..?

మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలంలోని శ్రీరామకొండపై వెలసిన స్వయంభు శ్రీరామపాద ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామకొండ క్షేత్రంలో శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీరామకొండ అర్చకుడు రాఘవేంద్రరావు తెలిపారు. శనివారం శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం నుంచి శ్రీరామకొండ వరకు శ్రీసీతారాముల పల్లకీ సేవ నిర్వహించామన్నారు. ఆదివారం ఉ.11.45 గంటలకు జరిగే కళ్యాణంలో భక్తులు పాల్గొనాలని కోరారు.