News March 22, 2025
నారాయణపేట జిల్లాలో దారుణం.. భర్తను చంపిన భార్య

భూ వివాదం కారణంగా భర్తను భార్య చంపేసిన ఘటన నర్వలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. లంకల గ్రామానికి చెందిన పాలెం అంజన్న(41) NRPT జిల్లాలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ మధ్య కొంత భూమిని అమ్మగా, మిగిలిన భూమి తన పేరుపై చేయలేదని కోపంతో భర్త మెడకు తాడు బిగించి చంపింది. రంగమ్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతుడి అక్క పద్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని SI కురుమయ్య తెలిపారు.
Similar News
News March 22, 2025
రెబ్బెన: గంగాపూర్ కారోబార్ ఆత్మహత్య

రెబ్బెన మండలం గంగాపూర్ కారోబార్ ప్రకాశ్ పురుగు మందు తాగి చికిత్స పొందుతూ మృతిచెందాడు. సూసైడ్ నోట్ ప్రకారం.. అదే గ్రామానికి చెందిన గుర్ల సోనీ డబ్బులు ఇవ్వమని లేకపోతే కేసు పెడతానని బెదిరించింది. దీంతో భయాందోళనకు గురైన ప్రకాశ్ పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. తన చావుకు కారణమైన వారిపై కేసు నమోదు చేయాలంటూ సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని BJP నాయకులు డిమాండ్ చేశారు.
News March 22, 2025
HYD: పదోన్నతి.. ఇంతలోనే అడిషనల్ DCP మృతి

హయత్‌నగర్‌లో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో అడిషనల్ DCP బాబ్జీ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల పోలీస్ సిబ్బంది తీవ్ర సంతాపం ప్రకటించింది. మార్చి 18న ఆయన అడిషనల్ SP ర్యాంక్ ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు. ఇంతలోనే మృతి చెందడం కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. పెద్ద అంబర్‌పేటలో నివాసం ఉండే బాబ్జీకి ఉదయం వాకింగ్ చేయడం అలవాటు. ఈ క్రమంలోనే హైవే మీద రోడ్డు దాటుతుండగా బస్సు ఢీ కొట్టింది.
News March 22, 2025
భార్య నుంచి ఆ కాల్ వస్తే చాలా టెన్షన్: అభిషేక్ బచ్చన్

‘ఐ వాంట్ టు టాక్’ అనే సినిమాకు ‘ఉత్తమ నటుడు’ పురస్కారం అందుకున్న సందర్భంగా నటుడు అభిషేక్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఐ వాంట్ టు టాక్’ అని ఎవరి కాల్ వస్తే మీరు టెన్షన్ పడతారంటూ హోస్ట్ అర్జున్ కపూర్ ప్రశ్నించగా.. తన భార్య నుంచి ఆ కాల్ వస్తే సమస్యలో పడ్డట్లేనని అభిషేక్ జవాబిచ్చారు. ఐష్, అభిషేక్ విడిపోనున్నారని గత కొంతకాలంగా వార్తలు హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.