News February 2, 2025
నారాయణపేట జిల్లాలో భారీ మొసలి కలకలం

నారాయణపేట జిల్లా నర్వ మండలం రాయికోడ్ గ్రామ సమీపంలో ఉన్న పొలంలో ఉదయం మొసలి కలకలం రేపింది. గ్రామ రైతు పొలంలో వెళ్తుండగా ఒడ్డున మొసలి కనిపించిందని తెలిపారు. పొలం మధ్యలో మొసలి ఉన్నట్లు అధికారులకు సమాచారం అందించారు. అటువైపు వెళ్లవద్దని, మత్స్యకారులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Similar News
News January 10, 2026
చిత్తూరు జిల్లాలో 638 విద్యుత్ సమస్యలు

చిత్తూరు జిల్లాలో శుక్రవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని 40 సెక్షన్లలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను గుర్తించారు. అందులో భాగంగా 11 కేవీ ఫీడర్ల పరంగా 251 సమస్యలు, ట్రాన్స్ ఫార్మర్లవి 26, LT లైన్ 339, సర్వీసు లైన్ 22 కలిపి మొత్తం 638 సమస్యలను గుర్తించినట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. వాటిలో 63 సమస్యలను పరిష్కారించినట్లు చెప్పారు.
News January 10, 2026
కవిలి చెట్లు కాస్తే కారువరి పండుతుంది

కవిలి చెట్లు అనేవి అడవులలో లేదా పొలం గట్లపై పెరిగే ఒక రకమైన చెట్లు. పూర్వం రైతులు ప్రకృతిలో జరిగే మార్పులను గమనించి వర్షాలను, పంటలను అంచనా వేసేవారు. కారువరి అంటే వర్షాకాలంలో పండే వరి పంట. కవిలి చెట్లు ఆ ఏడాది ఎక్కువగా పూతపూసి, కాయలు కాస్తే, ఆ ఏడాది వర్షాలు బాగా కురుస్తాయని, వరి పంట (కారు వరి) సమృద్ధిగా పండుతుందని రైతుల నమ్మకం. ఇలాంటి నమ్మకాలే అప్పట్లో రైతులకు ఒక ‘వ్యవసాయ క్యాలెండర్’లా ఉపయోగపడేవి.
News January 10, 2026
పుష్య మాసం శనీశ్వరుడికి ఎందుకు ఇష్టం?

పుష్యమాసం శనీశ్వరుడికి ప్రీతికరం. అందుకు కారణం ఆయన జన్మనక్షత్రం. శని దేవుడు పుష్యమి నక్షత్రంలో జన్మించాడు. చంద్రుడు పుష్యమి నక్షత్రంతో ఉండే మాసమే పుష్యమి కాబట్టి ఈ నెలలో చేసే పూజలకు ఆయన త్వరగా అనుగ్రహిస్తాడని నమ్మకం. శని దోషాలు ఉన్నవారు ఈ మాసంలో శని దేవుడికి తైలాభిషేకం, నువ్వుల దానం చేయడం వల్ల పీడలు తొలగి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. అందుకే శని గ్రహ శాంతికి ఈ మాసం అత్యంత శ్రేష్ఠమైనది.


