News February 2, 2025
నారాయణపేట జిల్లాలో భారీ మొసలి కలకలం
నారాయణపేట జిల్లా నర్వ మండలం రాయికోడ్ గ్రామ సమీపంలో ఉన్న పొలంలో ఉదయం మొసలి కలకలం రేపింది. గ్రామ రైతు పొలంలో వెళ్తుండగా ఒడ్డున మొసలి కనిపించిందని తెలిపారు. పొలం మధ్యలో మొసలి ఉన్నట్లు అధికారులకు సమాచారం అందించారు. అటువైపు వెళ్లవద్దని, మత్స్యకారులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Similar News
News February 2, 2025
RAILWAY: అన్నీ ఒకే యాప్‌లో..
ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు ఒకే దగ్గర కల్పించేందుకు రైల్వేశాఖ ‘SWA RAIL’ అనే సూపర్ యాప్ తెస్తోంది. తాజాగా కొంతమందికి EARLY ACCESS ఇచ్చింది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. ట్రైన్ టికెట్ బుకింగ్, పార్శిల్ బుకింగ్, కోచ్ పొజిషన్, రన్నింగ్ స్టేటస్, ఫుడ్ ఆర్డర్ల కోసం వేర్వేరు యాప్స్ వాడే అవసరం లేకుండా అన్నీ ఇందులోనే ఉంటాయి.
News February 2, 2025
పెద్దపల్లిలో MLC కవిత రేపటి పర్యటన షెడ్యూల్
పెద్దపల్లి జిల్లాలో ఎమ్మెల్సీ కవిత సోమవారం పర్యటించనున్నారు అని కాల్వ శ్రీరాంపూర్ మండల యూత్ నాయకులు రవి తెలిపారు. పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. 12PM పెద్దపల్లిలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారు @12:15PM మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నివాసంలో TBGKS నాయకులతో ఆత్మీయ సమీక్షలో పాల్గొంటారు @12:30 మీడియా సమావేశంలో మాట్లాడతారు @1PM సబితం గ్రామంలో జరిగే ఓ వివాహా వేడుకలో పాల్గొంటారు.
News February 2, 2025
T20 WC: 82కే సౌతాఫ్రికా ఆలౌట్
అండర్-19 ఉమెన్స్ టీ20 WC ఫైనల్లో భారత బౌలర్లు విజృంభించారు. దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌటైంది. తెలుగమ్మాయి త్రిష 3 వికెట్లతో సత్తా చాటారు. ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ, పరుణిక రెండేసి వికెట్లతో ఆకట్టుకున్నారు. భారత విజయలక్ష్యం 83.