News April 4, 2025
నారాయణపేట జిల్లా కలెక్టర్ అసహనం

నర్వ మండలం పాతర్‌చేడ్ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని గురువారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో చిన్నారులకు కుర్చీలు, ఆట పరికరాలు అందుబాటులో ఉన్నాయా.. లేదా అని అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల అభ్యాసన సామర్థ్యాన్ని పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రం ఇరుకైన గదుల్లో కొనసాగుతుండటంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా విశాలంగా వున్న గదుల్లోకి మార్చాలని ఆదేశించారు.
Similar News
News April 4, 2025
సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తాం: ఎస్పీ

విజయనగరం జిల్లా పోలీసుశాఖలో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం “పోలీసు వెల్ఫేర్ డే” నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరిని తన ఛాంబర్‌లోకి పిలిచి, వారి వ్యక్తిగత, వృత్తిపరమైన, శాఖాపరమైన సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వారి నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు.
News April 4, 2025
బీజేపీ అధ్యక్ష రేసులో లేను: అన్నామలై

TN BJP అధ్యక్ష రేసులో తాను లేనని ఆ పార్టీ ప్రస్తుత చీఫ్ అన్నామలై స్పష్టం చేశారు. ‘పార్టీలో ఎంతోమంది గొప్ప నేతలున్నారు. వారి నుంచే నాయకుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం’ అని పేర్కొన్నారు. ఇక.. వచ్చే ఏడాది ఎన్నికల్లో BJP ఒంటరిగా బరిలోకి దిగాలని అన్నామలై యోచిస్తుండగా ఆ పార్టీ AIADMKతో పొత్తు పెట్టుకోవచ్చన్న ఊహాగానాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన అధ్యక్ష బరినుంచి తప్పుకున్నారన్న చర్చ నడుస్తోంది.
News April 4, 2025
అనకాపల్లి: ‘సెలవులను పక్కాగా అమలు చేయాలి’

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అనకాపల్లి జిల్లాలో ఒంటి పూట సెలవులను పక్కాగా అమలు చేయాలని ఏపీ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో పలు ప్రైవేట్ పాఠశాలలో 9,10వ తరగతి విద్యార్థులకు రెండు పూటలా క్లాసులు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.