News April 17, 2025
నారాయణపేట జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పొరపాట్లు జరగకుండా చూడాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. నారాయణపేట కలెక్టరేట్‌లో బుధవారం ఎంపీడీవో, ఎంపీవో, మున్సిపల్ కమిషనర్లు, అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌తో కలిసి ఆమె సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని చెప్పారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా ఈనెల 21 వరకు లబ్ధిదారుల జాబితా ఎంపీడీవో ఆఫీసులకు చేరుతుందని చెప్పారు.
Similar News
News April 19, 2025
ఎన్టీఆర్: నాలుగు మండలాల్లో ఆరంజ్ అలర్ట్

ఎన్టీఆర్ జిల్లాలోని 4 మండలాల్లో శనివారం అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) ఎండీ ఆర్.కూర్మనాథ్ హెచ్చరిస్తూ ‘X’ పోస్ట్ చేశారు. నేడు చందర్లపాడు 44.7, జి.కొండూరు 44.2, విజయవాడ అర్బన్ 43.9, రూరల్‌లో 43.7 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు అవుతుందన్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
News April 19, 2025
వనపర్తిలో డిగ్రీ విద్యార్థిని MISSING

అలంపూర్‌కి చెందిన డిగ్రీ విద్యార్థిని వనపర్తి పట్టణంలో అదృశ్యమైన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. అలంపూర్ క్యాతూర్ వాసి దాసరి బిందు వనపర్తిలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ డిగ్రీ చదువుతోంది. ఈనెల 16 నుంచి ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు వనపర్తిలోని బంధువుల ఇళ్లలో ఆరా తీశారు. అయినా ఆచూకీ లభించలేదు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News April 19, 2025
GNT: మానవత్వం చాటుకున్న లాలాపేట పోలీసులు

గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని లాలాపేట స్టేషన్ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో సంగడిగుంటలో ఏఎస్సై నరసింహారావు, కానిస్టేబుల్ నాగరాజు గస్తీ నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి వచ్చి తన భార్య కాన్పు నొప్పులతో బాధపడుతుందని, వాహన సదుపాయం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో గస్తీ పోలీసులు గర్భిణిని తమ వాహనంలో జీజీహెచ్ కాన్పుల వార్డుకు తరలించారు.