News April 3, 2025

నారాయణపేట జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక 

image

ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) రాయితీ గడువును ప్రభుత్వం ఈనెల 30 వరకు పొడిగించినట్లు నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ రాయితీ కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దరఖాస్తుదారుల కోరిక మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు.

Similar News

News April 3, 2025

SRHకు బిగ్ షాక్

image

IPLలో SRH తీరు మారడం లేదు. అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మ మరోసారి తీవ్ర నిరాశకు గురిచేశారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే 4 రన్స్ కొట్టి హెడ్ ఔట్ కాగా తర్వాతి ఓవర్‌లో అభిషేక్ 2 రన్స్ చేసి పెవిలియన్ చేరారు. ఆ తర్వాతి ఓవర్‌లో ఇషాన్ కిషన్(2) కూడా క్యాచ్ ఔట్ అయ్యారు. దీంతో 201 రన్స్ భారీ టార్గెట్ ఛేదనలో SRH 9 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.

News April 3, 2025

పిల్లలకు పొగాకు అమ్మితే ఏడేళ్లు జైలు: విశాఖ సీపీ

image

విశాఖ నగర పరిధిలో స్కూల్స్, కాలేజీలకు 100 మీటర్ల పరిధిలో పొగాకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. సీపీ కార్యాలయంలో గురువారం అధికారులతో సమావేశమయ్యారు. పొగాకు వల్ల రాష్ట్రంలో ప్రతి ఏడాది 48వేల మరణాలు సంభవిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో రోజుకి 250 మంది పిల్లలు పొగాకు వాడుతున్నారన్నారు. పిల్లలకు పొగాకు అమ్మితే ఏడేళ్లు జైళ్ళు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తామన్నారు.

News April 3, 2025

ఏలూరు జిల్లా వ్యాప్తంగా ప్రధాన అంశాలు.

image

*ఏలూరు జిల్లాలో నలుగురు నకిలీ పోలీసుల అరెస్టు. *స్వయం ఉపాధి పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు బ్యాంకర్లకు పంపాలని ఎంపీడీవోలకు కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశాలు.*500 మంది పిల్లలకు రూ.75 లక్షల విలువ చేసే ఉపకరణాల పంపిణీ. * రాపిడో, ఓలా, ఉబర్ సంస్థలను బహిష్కరించాలని ఆటో డ్రైవర్ల ఆందోళన. *పాస్టర్ ప్రవీణ్ మృతికి న్యాయం చేయాలని జంగారెడ్డిగూడెం, కామవరపుకోట మండలాలలో నిరసన ర్యాలీలు.

error: Content is protected !!