News April 5, 2025

నారాయణపేట జిల్లా ప్రజలకు WARNING

image

సైబర్ మోసగాళ్ల మాయమాటలు నమ్మొద్దని, కేటుగాళ్లతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేశ్ గౌతమ్ శుక్రవారం హెచ్చరించారు. సైబర్ మోసంలో ఆర్థికంగా నష్టపోతే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో లేదా టోల్ ఫ్రీ 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఆన్‌లైన్‌లో https://www.cybercrime.gov.in సైతం ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. అపరిచితులకు బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వకూడదన్నారు. SHARE IT

Similar News

News April 12, 2025

నరసరావుపేట: ఎస్పీ కంచి శ్రీనివాసరావు కీలక సూచన 

image

పల్నాడు జిల్లాలోని పోలీస్ కార్యాలయంలో ఈనెల 14న సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 14వ తేదీన అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించిందన్నారు. ఇందులో భాగంగా సోమవారం జరిగే ప్రజా సమస్యలపరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని ప్రజలందరూ గమనించి సహకరించాలన్నారు. 

News April 12, 2025

55,418 పోస్టుల భర్తీకి సీఎం ఆదేశం

image

TG: రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 55,418 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. గత 16 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 58,868 పోస్టులను భర్తీ చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు 55,418 ఉద్యోగాలను భర్తీ చేస్తే ఈ సంఖ్య 1.14 లక్షలకు చేరుతుందని పేర్కొన్నారు. దీంతో ఉద్యోగాల భర్తీలో రికార్డు సృష్టించినట్లు అవుతుందని అన్నారు.

News April 12, 2025

పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ముగ్గురు కోనసీమ నేతలు

image

వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పొలిటికల్ అడ్వైజరీ కమిటీని శనివారం పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించారు. నూతన కమిటీలో కోనసీమ జిల్లాకు ప్రాధాన్యం కల్పించారు. ఈ జిల్లాకు చెందిన ముగ్గురికి స్థానం కల్పించారు.  పిల్లి సుభాష్ చంద్రబోస్,  తోట త్రిమూర్తులు, పినిపె విశ్వరూప్ కు అవకాశం కల్పించారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

error: Content is protected !!