News March 19, 2025

నారాయణపేట జిల్లా బిడ్డ సత్తా..!

image

నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలానికి చెందిన కనకప్ప పారా అథ్లెటిక్ ఖేలో ఇండియా జాతీయ స్థాయి లాంగ్ జంప్ క్రీడలకు ఎంపికైనట్లు అథ్లెటిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రమణ బుధవారం తెలిపారు. ఈనెల 21 నుంచి 23 వరకు ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. జాతీయ స్థాయి క్రీడలకు విద్యార్థి ఎంపిక కావడంపై క్రీడాకారులు, క్రీడాభిమానులు, అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News February 20, 2026

మంచిర్యాల: ప్రేమ.. పెళ్లి.. సూసైడ్

image

అన్నా.. నేను చనిపోతున్నా అంటూ ఫోన్ చేసి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. MNCL వాసి మమత(29), నరేశ్‌లది ప్రేమ వివాహం. పెళ్లైన నెల నుంచే కట్నం కోసం అత్తారింటి వారు వేధించసాగారు. ఈనెల 16న ఆస్పత్రి వద్ద వారు దూషించడంతో మనస్తాపం చెందిన మమత.. తీగలగుట్టపల్లి రైల్వే ట్రాక్ సమీపంలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే ప్రాణాలు విడిచింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

News February 20, 2026

కరీంనగర్: ‘ఆసరా’పై ఆశలు చిగురిస్తున్నాయి..!

image

రాష్ట్ర ప్రభుత్వం ‘చేయూత’ పథకం కింద పెన్షన్ల పెంపునకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం వృద్ధాప్య, వితంతు పెన్షన్ పొందుతున్న రూ.2,016ను రూ.4,000కు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. దివ్యాంగులకిచ్చే రూ.4,016 పెన్షన్‌ను రూ.6,000కు పెంచే అవకాశం ఉంది. రానున్న బడ్జెట్‌లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 5.5లక్షల మంది ఆసరా పెన్షన్లు పొందుతున్నారు.

News February 20, 2026

నార్కట్‌పల్లి: భూ వివాదం.. కళ్లలో కారం చల్లి కత్తితో దాడి

image

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలులో భూ వివాదం రక్తపాతానికి దారితీసింది. సర్వే నంబర్ 1455 భూమిలో జెర్రిపోతుల రమేష్ తన భార్య గోరీని నిర్మిస్తుండగా, బాసాని శివ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రమేష్, అతని కుమార్తె నేహా పథకం ప్రకారం శివ కళ్లలో కారం చల్లి, కత్తితో దాడి చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై విష్ణుమూర్తి బాధితుడిని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.