News April 4, 2025
నారాయణపేట జిల్లా రైతులకు కలెక్టర్ ముఖ్య గమనిక

రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో వరి ధాన్యం (సన్న రకం) కొనుగోలుకు సంబంధించి క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించిందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. అయితే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలు తప్పని సరిగా పాటించాలని అన్నారు. గురువారం నారాయణపేట నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాలపై అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు.
Similar News
News April 4, 2025
గచ్చిబౌలి భూముల్లోకి బయటి వ్యక్తుల నిషేధం

TG: కంచ గచ్చిబౌలి భూములపై పోలీసులు కీలక ఆదేశాలిచ్చారు. ఈ వ్యవహారంతో సంబంధం లేని వ్యక్తులు ఆ భూముల్లోకి వెళ్లరాదని స్పష్టం చేశారు. ఆంక్షలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News April 4, 2025
నాగాంజలి ఆత్మహత్య.. వెలుగులోకి సంచలన విషయాలు

AP: రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థిని <<15986707>>నాగాంజలి ఆత్మహత్య<<>> కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెను మోసం చేసినట్లు ఆస్పత్రి ఏజీఎం దీపక్ ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు. ‘నాగాంజలిని దీపక్ లైంగికంగా లోబర్చుకున్నాడు. ఆ తర్వాత చస్తే చావు.. పెళ్లి మాత్రం చేసుకునేది లేదని చెప్పాడు. దీంతో ఆమె సూసైడ్ చేసుకున్నారు’ అని పేర్కొన్నారు.
News April 4, 2025
IIT హైదరాబాద్‌కు విరాళమిస్తే నో టాక్స్

ప్రముఖ విద్యాసంస్థ ఐఐటీ హైదరాబాద్‌కు విరాళమిచ్చే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. ఈ విద్యా సంస్థకు విరాళం ఇస్తే ఆ మొత్తానికి సంబంధించి టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. గతంలో 50% పన్ను చెల్లించాల్సి ఉండేది. అయితే ఇపుడు ఐటీ యాక్ట్ సెక్షన్ 80జీ ప్రకారం విరాళాలు టాక్స్ ఫ్రీ అని ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొ.బీఎస్ మూర్తి తెలిపారు.