News April 3, 2025
నారాయణపేట: టెన్త్ క్లాస్ పాసయ్యారా..? మీ కోసమే..!

సేవా భారతి, ఇన్ఫోసిస్ నిర్మాణ్ ఆధ్వర్యంలో ఈనెల 4న నారాయణపేట నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు సేవా భారతి పాలమూరు విభాగ్ కార్యదర్శి శ్రీనివాస్ గౌస్ బుధవారం తెలిపారు. జిల్లాలోని టెన్త్ క్లాస్, ఐటీఐ, ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ చదువుతున్న, సమానమైన అర్హతలు ఉన్న విద్యార్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చని చెప్పారు. శుక్రవారం ఉ.10 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందన్నారు.
Similar News
News April 4, 2025
ఎమ్మెల్యేతో పెళ్లి వార్తలు.. యాంకర్ ప్రదీప్ ఏమన్నారంటే?

ఓ ఎమ్మెల్యేని పెళ్లి చేసుకోబోతున్నారని వస్తున్న వార్తలపై యాంకర్, హీరో ప్రదీప్ మాచిరాజు స్పందించారు. అవన్నీ సరదా ప్రచారాలు మాత్రమేనని కొట్టిపారేశారు. గతంలో రియల్ ఎస్టేట్ ఫ్యామిలీ అమ్మాయితో వివాహం అన్నారని, త్వరలో క్రికెటర్‌తో మ్యారేజ్ అంటారేమోనని పేర్కొన్నారు. ప్రస్తుతం వివాహానికి సంబంధించిన ప్లాన్ లేదని స్పష్టం చేశారు. ఆయన నటించిన ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ మూవీ ఈ నెల 11న విడుదల కానుంది.
News April 3, 2025
మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌లో పసుపు ధర ఇలా

జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం పసుపు ధర ఈవిధంగా ఉన్నాయి. ఈరోజు పసుపు కాడి గరిష్ఠ ధర రూ.14,395, కనిష్ఠ ధర రూ.9,009, పసుపు గోళం గరిష్ఠ ధర రూ.13,556, కనిష్ఠ ధర రూ.8,888 పసుపు చూర గరిష్ఠ ధర రూ.10,445, కనిష్ఠ ధర రూ.9,292గా పలికిందని కార్యదర్శి తెలిపారు. ఈరోజు మొత్తం 1783 క్వింటాళ్ల పసుపు కొనుగోళ్లు జరిగాయని ఆయన పేర్కొన్నారు.
News April 3, 2025
టీడీపీదే కబ్జాల బతుకు: వైసీపీ

AP: వక్ఫ్ భూములను కబ్జా చేసి HYD సాక్షి ఆఫీసును జగన్ నిర్మించారంటూ TDP చేసిన ఆరోపణలపై YCP ఫైరయ్యింది. ‘మీ బతుకే కబ్జాల బతుకు. NTR పార్టీని, సైకిల్ గుర్తును, బ్యాంకు ఖాతాలను లాక్కున్నారు. HYDలో NTR ట్రస్ట్ భవన్‌కు GOVT స్థలాన్ని, మంగళగిరిలో పార్టీ ఆఫీస్‌కు వాగు పోరంబోకు భూమిని కబ్జా చేశారు. వక్ఫ్ బిల్లుకు మద్దతిచ్చి, ముస్లింలకు వెన్నుపోటు పొడిచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు’ అని మండిపడింది.