News December 17, 2025
నారాయణపేట: తుది దశలో మొదటి విజయం

ఊట్కూరు మండల పరిధిలోని సమిస్తాపూర్ గ్రామంలో పంచాయతీ ఎన్నికల తొలి ఫలితం వెలువడింది. గ్రామంలో మొత్తం 440 ఓట్లు ఉండగా 382 ఓట్లు పోలయ్యాయి. నలుగురు అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీలో రింగు గుర్తుకు 48, కత్తెర గుర్తుకు 176, బ్యాట్ గుర్తుకు 30, ఫుట్‌బాల్ గుర్తుకు 127 ఓట్లు వచ్చాయి. ఇందులో కత్తెర గుర్తుతో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జయప్రకాశ్ రెడ్డి సర్పంచ్‌గా గెలుపొందారు.
Similar News
News December 17, 2025
MBNR: ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు పీయూ విద్యార్థిని ఎంపిక

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజ్ కు చెందిన విద్యార్థిని పాత్లావత్ పద్మావతి ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ఎంపికయ్యారు. వివిధ దశల స్క్రీనింగ్‌లను ఎదుర్కొని ఎంపిక కావడం పీయూకి గర్వకారణమని, గణతంత్ర వేడుకల్లో తెలంగాణ ఔన్నత్యాన్ని చాటాలని ఉపకులపతి ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్ అన్నారు. కోఆర్డినేటర్ డా ప్రవీణ, కంటింజెంట్ అధికారి డా అర్జున్ కుమార్ పాల్గొన్నారు.
News December 17, 2025
MLAలకు స్పీకర్ క్లీన్‌చిట్.. నెక్స్ట్ ఏంటి?

TG: పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ ప్రసాద్ ఐదుగురు <<18592868>>MLA<<>>ల వాదనలతో ఏకీభవించారు. తాము ముఖ్యమంత్రిని కలిసిన మాట నిజమేనని కానీ పార్టీ మారలేదని, కండువా కప్పుకోలేదని వారు స్పష్టం చేశారు. నిధుల కోసం CMను కలవడంలో తప్పు లేదని వాదించారు. దీంతో వారు పార్టీ మారినట్లు BRS చేసిన ఆరోపణలను స్పీకర్ కొట్టేశారు. ఫలితంగా వారు MLAలుగా కొనసాగనున్నారు. ఇదే విషయాన్ని రేపు అసెంబ్లీ కార్యదర్శి సుప్రీంకోర్టుకు తెలపనున్నారు.
News December 17, 2025
కరీంనగర్ జిల్లాలో 86.42% పోలింగ్ నమోదు

కరీంనగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 5 మండలాల్లో తుది పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించారు. మొత్తం 86.42% పోలింగ్ కాగా, ఇల్లందకుంటలో 87.05%, హుజూరాబాద్ లో 85.94%, జమ్మికుంటలో 85.72%, వీణవంకలో 85.87%, సైదాపూర్ లో 87.85% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. మొత్తం 111 గ్రామ పంచాయితీల్లో 165046 ఓట్లకు గాను 142637 ఓట్లు పోలయ్యాయి.


