News April 18, 2025
నారాయణపేట: ‘నా భర్త చనిపోయాడు.. నన్ను ఆదుకోండి మేడం’

మద్దూరు మండలంలో జరిగిన భూభారతి సభలో ఓమేశ్వరి అనే మహిళ తన సమస్యను కలెక్టర్‌కి వివరించి, న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. మహిళ మాట్లాడుతూ.. తన భర్త కాశప్ప చనిపోయి సంవత్సరం అవుతోందని, కానీ తనకి ఇప్పటి వరకు ఒక్క ప్రభుత్వం పథకం నుంచి లబ్ధి చేకూరలేదన్నారు. వితంతు పెన్షన్ కూడా రావడం లేదని, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా తన గోడు పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వం సహాయం చేయాలని కలెక్టర్‌ని కోరారు.
Similar News
News April 19, 2025
ఆర్ఎస్పీపై తప్పుడు ప్రచారాలు.. తెలంగాణ గళంపై ఫిర్యాదు

కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకులు “తెలంగాణ గళం” అనే సోషల్ మీడియా సంస్థపై ఫిర్యాదు చేశారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి శ్యామ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ గళం అనే సోషల్ మీడియా సంస్థ బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్పీ ఫోటోలు వీడియోలను మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేసిందన్నారు. బీఆర్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా చేసిన ఈ తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాల్సిందిగా వారు కోరారు.
News April 19, 2025
కొబ్బరి కాయలో నీళ్లు ఎలా వస్తాయి?

కొబ్బరికాయలో ఎక్సోకార్ప్(పచ్చని పైపొర), మీసోకార్ప్(పీచు), ఎండోకార్ప్(టెంక) అనే 3 పొరలుంటాయి. ఎండోకార్ప్‌లో ఎండోస్పెర్మ్(ముదిరాక కొబ్బరి), నీళ్లు అనే రెండు భాగాలుంటాయి. కొబ్బరి చెట్టులోని వాస్క్యులర్(రవాణా) వ్యవస్థ వేళ్ల నుంచి ఖనిజాలు కలిగిన భూగర్భ జలాలను జైలమ్ నాళాల ద్వారా టెంకలోకి చేరుస్తుంది. వాటినే కొబ్బరి నీళ్లు అంటాం. కాయ ముదిరే కొద్ది నీరే కొబ్బరిగా మారుతూ ఉంటుంది.
News April 19, 2025
మందమర్రి: యువకుడి ఇంటిముందు హిజ్రాల ధర్నా

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో హిజ్రాలు బైఠాయించి ఆందోళన చేపట్టారు. పట్టణంలోని మొదటి జోన్ కమ్యూనిటీ హాల్ వెనకాల హిజ్రాలను వేధింపులకు గురి చేస్తున్న ఓ యువకుడి ఇంటి ముందు హిజ్రాలు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. తమను యువకుడు అసభ్య పదజాలంతో వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. అతని వలన తీవ్ర ఆందోళనకు గురవుతున్నామన్నారు. వెంటనే అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.