News April 11, 2025
నారాయణపేట: పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష

నారాయణపేట జిల్లా ధన్వాడ మండలానికి చెందిన మైనర్ బాలికను అత్యాచారం చేసిన ఇదే మండలానికి చెందిన టప్ప భాను అనే నిందితుడికి గురువారం జిల్లా న్యాయమూర్తి అబ్దుల్ రఫీ 26 ఏళ్ల జైలు శిక్ష, రూ.8 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారని ఎస్పీ యోగేశ్ గౌతమ్ తెలిపారు. 2024 మార్చి 17న బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. సాక్ష్యాధారాల పరిశీలన అనంతరం కోర్టు తీర్పు వెల్లడించిందని చెప్పారు.
Similar News
News April 18, 2025
రుషికొండలో తిరుమల విక్రయాలు పునఃప్రారంభం

రుషికొండ శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డూ విక్రయాలు శనివారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఇటీవల ఒంటిమిట్ట సీతారామ కల్యాణోత్సవం కోసం లడ్డూలు తరలించడంతో అమ్మకాలు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పుడు భక్తులకోసం ఆలయంలోనే కౌంటర్ ద్వారా లడ్డూల విక్రయాలు ఏప్రిల్ 19వ తేదీ నుంచి మళ్లీ ప్రారంభమవుతాయని ఆలయ ఏఈఓ జగన్మోహనాచార్యులు శుక్రవారం తెలిపారు.
News April 18, 2025
అర్జీలు స్వీకరించిన హోం మంత్రి అనిత

మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. సమస్యలపై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వాటిని పరిశీలించిన మంత్రి పలు సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
News April 18, 2025
IPL: అరేయ్ ఏంట్రా ఇది!

ఇవాళ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే, ఇదే జట్ల మధ్య ఒక్క రోజు గ్యాప్‌తో ఎల్లుండి మరోసారి చండీగఢ్‌లో మ్యాచ్ ఉంది. ఈ షెడ్యూల్ చూసి క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. మధ్యలో ఉన్న ఆ ఒక్క రోజు కూడా ట్రావెలింగ్‌కు కేటాయించారు. దీంతో గ్యాప్ ఇవ్వకుండా అవే జట్లకు వరుసగా మ్యాచులు పెట్టడం ఏంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.