News March 21, 2025
నారాయణపేట: భార్యను చంపిన భర్త ARREST

నారాయణపేట మండలం రెడ్యానాయక్ తండాలో <<15830699>>భార్యను హత్య<<>> చేసిన భర్తను అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లు డీఎస్పీ లింగయ్య శుక్రవారం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. భార్య శారు రాథోడ్(20) అంటే ఇష్టం లేక వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో భర్త వినోద్ నాయక్ ఈనెల 19న రాత్రి ముందస్తు పథకం మేరకు గొంతు నులిమి ఆమెను హత్య చేశాడని తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించామన్నారు.
Similar News
News March 28, 2025
వచ్చే నెల 19నుంచి రాహుల్ గాంధీ అమెరికా పర్యటన

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వచ్చే నెల 19న అమెరికాకు వెళ్లనున్నారు. బ్రౌన్ యూనివర్సిటీని సందర్శించిన అంతరం బోస్టన్‌లోని భారత సంతతి ప్రజలతో ఆయన మమేకమవుతారని తెలుస్తోంది. గత ఏడాది సెప్టెంబరులో ఆయన డల్లాస్, వాషింగ్టన్ డీసీలో పర్యటించారు. టెక్సాస్ వర్సిటీలో విద్యార్థులు, అధ్యాపకులతో ముచ్చటించారు.
News March 28, 2025
నిజామాబాద్ జిల్లాలో గంజాయి కలకలం

నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం గుత్ప గ్రామంలో గంజాయి కలకలం రేపింది. అపురూపాలయం సమీపంలో ఉన్న రైల్వే బ్రిడ్జి కింద శుక్రవారం ముగ్గురు యువకులు గంజాయి సేవిస్తుండగా స్థానిక విలేకర్లు గ్రామస్థుల సహాయంతో పట్టుకున్నారు. గ్రామంలో విచారించగా వీరు ఇతరులకు విక్రయిస్తున్నారని తెలిసింది. మాక్లూర్ పోలీస్‌లకు సమాచారం అందించగా నిందితుల నుంచి మూడు ప్యాకెట్ల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు.
News March 28, 2025
నెల్లూరు: ఐదుగురు ఎంపీటీసీలు సస్పెండ్

విడవలూరు మండలానికి సంబంధించిన ఐదుగురు ఎంపీటీసీ సభ్యులను వైసీపీ అధిష్ఠానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు ఆవుల శ్రీనివాసులు(రామచంద్రాపురం), అక్కయ్యగారి బుజ్జమ్మ(పెద్దపాళెం), వెందోటి భక్తవత్సలయ్య(వరిణి), ముంగర భానుప్రకాశ్(దంపూరు), చింతాటి జగన్మోహన్(అలగానిపాడు)ను సస్పెండ్ చేసినట్లు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రకటించారు.