News February 4, 2025
నారాయణపేట: భార్య ఆత్మహత్య.. భర్తకు జైలు శిక్ష

భార్య ఆత్మహత్యకు కారణమైన భర్తకు జైలు శిక్ష పడింది. కర్ణాటకలోని యాదగిరి జిల్లాకు చెందిన మహేశ్‌కు పదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.25 వెలు జరిమానా విధిస్తూ మంగళవారం న్యాయమూర్తి అబ్దుల్ రఫీ తీర్పు వెల్లడించారని ఎస్పీ యోగేశ్ గౌతమ్ తెలిపారు. అదనపు కట్నం తేవాలని వేధించడంతో 2023 మే 31న నారాయణపేట (M) సింగారం గ్రామానికి చెందిన భవాని ఉరేసుకుందని, ఆమె అన్న భరత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News December 25, 2025
మహేశ్ న్యూ లుక్.. రాముడి పాత్ర కోసమే!

నిన్న మొన్నటి వరకు సూపర్ స్టార్ మహేశ్ బాబు లాంగ్ హెయిర్, గడ్డంతో కాస్త రగ్గుడ్ లుక్‌లో కనిపించారు. ఇప్పుడు క్లీన్ షేవ్ చేసుకుని మిల్క్ బాయ్‌లా మారిపోయారు. వారణాసి మూవీలో ఆయన రాముడిగా కనిపిస్తారని ఇప్పటికే రాజమౌళి ప్రకటించారు. ఇటీవల ఒక షెడ్యూల్ పూర్తైందని <<18653569>>ప్రకాశ్ రాజ్<<>> ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. కొత్త షెడ్యూల్లో రాముడి పాత్ర షూట్ కోసమే ఇలా గెటప్ మార్చేశారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
News December 25, 2025
2049 నాటికి అరుణాచల్ హస్తగతమే చైనా లక్ష్యం: US రిపోర్ట్

అరుణాచల్‌ను చైనా తన ‘కోర్ ఇంట్రెస్ట్’ జాబితాలో చేర్చినట్లు అమెరికా <<18660718>>నివేదిక<<>> వెల్లడించింది. 2049 నాటికి తైవాన్‌తో పాటు అరుణాచల్‌ను హస్తగతం చేసుకోవడమే ఆ దేశ లక్ష్యమని పేర్కొంది. సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గుతున్నట్లు కనిపిస్తున్నా.. డ్రాగన్ తన సైనిక బలాన్ని పెంచుతూ భారత్‌పై ఒత్తిడి తెస్తోందని తెలిపింది. అరుణాచల్ వాసుల పాస్‌పోర్ట్‌ల విషయంలో వేధింపులకు పాల్పడుతున్న విషయాన్ని గుర్తుచేసింది.
News December 25, 2025
వేములవాడ: దర్శనాల దందాపై ఆలయ అధికారుల విచారణ

వేములవాడ భీమేశ్వర ఆలయంలో <<18666174>>బ్లాక్‌లో<<>> దర్శనాలు చేయిస్తున్న వ్యవహారంపై ఆలయ అధికారులు విచారణ చేపట్టారు. వరంగల్‌కు చెందిన 8 మంది భక్తుల వద్ద 300 రూపాయల చొప్పున వసూలు చేసి దర్శనానికి తీసుకు వెళుతున్న చింతల్ ఠాణాకు చెందిన యువకుడుని అదుపులోకి తీసుకుని విచారించగా బ్లాక్ దందా ముఠాలో 8 మంది ఉన్నట్లు తేలింది. దీంతో ఈ వ్యవహారంపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమైనట్లు తెలిసింది.


