News May 7, 2025

నారాయణపేట: మార్కెట్ యార్డ్‌లో టెండర్ ప్రక్రియ వాయిదా

image

నారాయణపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం జరగాల్సిన టెండర్ (బీట్) వాయిదా వేస్తున్నట్లు మార్కెట్ కార్యదర్శి తెలిపారు. రెండు రోజులుగా వరి ధాన్యం ఎక్కువ మొత్తంలో యార్డ్‌కు చేరుకుందని, దీంతో ధాన్యం తూకాలు, లిఫ్టింగ్ చేయడంలో ఆలస్యం జరగడమే కాకుండా యార్డులో స్థలాభావ పరిస్థితి నెలకొన్నట్లు తెలిపారు. ఈ కారణంగా టెండర్ ప్రక్రియ జరగదని, ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు.

Similar News

News April 5, 2026

సిద్దిపేట: మెగా జాబ్ మేళా.. రిజిస్ట్రేషన్ చేసుకోండి

image

సిద్దిపేట జిల్లా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో సిద్దిపేట పోలీసుల ఆధ్వర్యంలో “సిద్దిపేట పోలీస్ ఉద్యోగ మిత్ర” పేరుతో ఒక భారీ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తోంది. ఈ ముందడుగు కార్యక్రమం ద్వారా జిల్లాలోని అర్హులైన యువతీ యువకులకు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు పొందే సువర్ణావకాశాన్ని కల్పిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ తెలిపారు. Q ఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషచేసుకోవాలన్నారు.

News April 5, 2026

తిరుమలలో ఈ విషయం మీకు తెలుసా.?

image

తిరుమలలో శ్రీవారి ఆరాధనలు వైఖానస ఆగమం ప్రకారం జరుగుతాయి. 650 ఏళ్ల క్రితం స్వామి వారు అర్చకుని కలలో ప్రత్యక్షమై మలయప్ప కోనలోని విగ్రహాలను తెచ్చి ఉత్సవమూర్తులుగా ప్రతిష్ఠించాలని ఆజ్ఞాపించారట. గుహలోని ఆ విగ్రహాలు ఆశ్చర్యకరంగా కాంతివంతంగా ఉండేవట. అప్పటి నుంచి మలయప్ప స్వామి ప్రతిరోజూ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తున్నారు. తిరుమలలో ప్రతి రోజు ఊరేగే ఏకైక దేవుడు మలయప్పే కావడం విశేషం. <<19569854>>NEXT<<>>.

News April 5, 2026

మలయప్ప స్వామి విశిష్ఠత ఇదే.!

image

రహస్యమైన మలయప్ప కోనలో లభించిన విగ్రహాలు తరువాత మలయప్ప స్వామిగా ప్రసిద్ధి చెందాయి. తమిళంలో “మలై కని వుండ్రు పెరుమాళ్” అని పిలిచే ఈ స్వామి, కొండ లోయలో ప్రత్యక్షమైన దేవరూపంగా భావిస్తారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆజ్ఞతో ప్రతిష్ఠించిన ఈ ఉత్సవమూర్తులు అన్ని ఉత్సవాల్లో పాల్గొంటాయి. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల్లో మలయప్ప స్వామి ఊరేగింపులు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ గుహను నేటికీ వైకుంఠ తీర్థంగా భావించడం విశేషం.