News December 29, 2025
నారాయణపేట మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు ప్రారంభం

నారాయణపేట మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులుగా విభజించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 41,539 మంది ఉన్నారు. వీరిలో ఎస్టీ జనాభా 40, ఎస్సీ జనాభా 3,360గా ఉంది. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం ఓటరు జాబితాను తయారు చేయాలని అధికారులను ఈరోజు ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికలపై నెలకొన్న సందిగ్ధం వీడింది.
Similar News
News February 14, 2026
విశాఖ: కోస్టల్ కారిడార్‌లో మార్పులు

సవరించిన VMRDA మాస్టర్ ప్లాన్‌లో భోగాపురం ఎయిర్‌పోర్ట్ అనుసంధాన బీచ్ కారిడార్‌కు స్వల్ప మార్పులు ప్రతిపాదించారు. కోస్టల్ బ్యాటరీ-కైలాసగిరి వరకు 40M, అక్కడి నుంచి భోగాపురం వరకు 60M వెడల్పుతో రహదారి ప్రతిపాదన, రాడిసన్ బ్లూ వద్ద ఎలివేటెడ్ మార్గం, మూలకుద్దు సమీపంలో ఐకానిక్ బ్రిడ్జి ప్రణాళికలో ఉన్నాయి. ఈ మార్పులు ట్రాఫిక్ సౌలభ్యం, పర్యాటక అభివృద్ధి దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు అధికారులు తెలిపారు.
News February 14, 2026
పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర రూ.1,970 పెరిగి రూ.1,57,750కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రేటు రూ.1,800 పెరిగి రూ.1,44,600 పలుకుతోంది. మరోవైపు ఇవాళ వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం కేజీ వెండి రేటు రూ.2.80 లక్షలుగా ఉంది.
News February 14, 2026
MDK: మీలాంటి వ్యక్తి మీ కూతురుకి భర్తగా వస్తే..?

ఉమ్మడి MDK జిల్లాలో మూడు ముళ్ల బంధాలు మున్నాళ్ల ముచ్చటవుతున్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడమే కారణమని తెలుస్తోంది. మీ కూతురుకి మీలాంటి లక్షణాలన్న వ్యక్తి భర్తగా వస్తే అంగీకరిస్తారా? అలాగే స్త్రీలూ మీ అబ్బాయికి మీలాంటి వ్యక్తి భార్యగా వస్తే అంగీకరిస్తారా? అంగీకరించలేకుంటే అలా మిమ్మల్ని మార్చుకుంటే బంధాలు నిలబడతాయి. యువత ఆత్మపరిశీలన చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.


