News February 22, 2025
నారాయణపేట: రేపే ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్ష

తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశ పరీక్ష రేపు జరుగనుంది. పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగనుంది. 30 నిమిషాల ముందే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు పేర్కొన్నారు. హాల్ టికెట్‌తో పాటు బ్లూ/బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను వెంట తీసుకురావాలని వారు సూచించారు.
Similar News
News July 4, 2025
యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు: కలెక్టర్

ఎరువుల షాపుల డీలర్లు, యజమానులు యూరియాను కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ సత్య శారద దేవి హెచ్చరించారు. శుక్రవారం సంగెం మండలం గవిచర్ల, కాపుల కనపర్తి గ్రామాల్లో ఉన్న ఎరువుల షాపులు, కో-ఆపరేటివ్ సొసైటీలను ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
News July 4, 2025
అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ములుగు కలెక్టర్

గోదావరి నీటి ప్రవాహం పెరుగుతోందని, ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. ఏటూరునాగారం, మంగపేటలోని గోదావరి కరకట్టను ఆయన పరిశీలించారు. రాబోయే వర్షాలు, వరదలను దృష్టిలో ఉంచుకొని సకాలంలో నివాస గ్రామాలను ఖాళీ చేయించి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో తగినంత ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
News July 4, 2025
11 ఏళ్లలో TGకి మోదీ ఏం ఇచ్చారు?: ఖర్గే

TG: కార్యకర్తల కృషి వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని AICC చీఫ్ ఖర్గే పేర్కొన్నారు. LB స్టేడియంలో సామాజిక న్యాయ సమరభేరి సభలో మాట్లాడుతూ ‘రేవంత్, భట్టి కలిసి KCRను ఓడించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం. HYDలోని పెద్ద పరిశ్రమలన్నీ కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయి. 11 ఏళ్లలో TGకి మోదీ ఏం ఇచ్చారు? రూ.15 లక్షలు, ఏటా 2 కోట్ల జాబ్స్ ఇచ్చారా’ అని వ్యాఖ్యానించారు.