News August 29, 2025

నారాయణపేట: ‘శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి’

image

ఏ బుక్ ఆన్ డిజిటల్ లెర్నింగ్‌పై మూడు రోజులపాటు శిక్షణను పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు చెందిన సైన్స్, గణిత శాస్త్రం ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని DEO గోవిందరాజు అన్నారు. నారాయణపేట గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులను ప్రారంభించి మాట్లాడారు. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్ డిజైన్, డిజిటల్ థింకింగ్ టెక్నాలజీ అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.

Similar News

News August 29, 2025

2,534 పోలింగ్ కేంద్రాలు: జనగామ కలెక్టర్

image

జిల్లాలో 12 మండలాల్లోని 280 గ్రామ పంచాయతీల్లో 2,534 వార్డులకు గాను 2,534 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. శుక్రవారం ముసాయిదా ఓటర్ల జాబితాపై అఖిలపక్ష పార్టీలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మహిళా ఓటర్లు 2,02,906 ఉండగా, పురుషులు 1,98,466, ఇతరులు 8 మంది, మొత్తంగా 4,01,380 ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఓటరు మార్పులు, చేర్పులకు దరఖాస్తులు అందించవచ్చన్నారు.

News August 29, 2025

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 41.50 అడుగులు

image

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నీటిమట్టం 41.50 అడుగులకు చేరింది. దిగువ ప్రాంతానికి 8,68,724 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

News August 29, 2025

20 బంతులేసేందుకు 34,000 కి.మీ జర్నీ!

image

ది హండ్రెడ్ మెన్స్ లీగ్‌లో వరుసగా మూడోసారి ఓవల్ ఇన్విన్స్‌బుల్స్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ సీజన్‌లో రాణించిన బౌలర్ రషీద్ ఖాన్ జాతీయ జట్టుకు ఆడేందుకు లీగ్‌ను వీడారు. అతడి స్థానంలో ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపాను రీప్లేస్ చేసుకుంది. కాగా జంపా ఫైనల్లో 20 బంతులు వేసేందుకు ఆస్ట్రేలియా నుంచి ఇంగ్లండ్‌కు రానుపోను 34,000 కి.మీ ప్రయాణించనున్నారు. ఈ నెల 31న లార్డ్స్‌లో జరగబోయే ఫైనల్లో జంపా బరిలోకి దిగుతారు.