News April 15, 2025
నారాయణపేట: సీఎల్పీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద ఉన్న నోవాటెల్ హోటల్‌లో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సీఎల్పీ సమావేశంలో నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి సహచర ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్నారు. సమావేశంలో సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ వర్గీకరణ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. పథకాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారని ఎమ్మెల్యే అన్నారు.
Similar News
News February 24, 2026
కాసేపట్లో వర్షం..

TG: హైదరాబాద్‌లో కాసేపట్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. BHEL, లింగంపల్లి, పటాన్‌చెరు, బాచుపల్లి, నిజాంపేట్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, కుత్బుల్లాపూర్ ఏరియాల్లో మరో గంటలో వాన పడుతుందని తెలిపారు. ఆ తర్వాత మాదాపూర్, షేక్‌పేట్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని వివరించారు. మరి మీ ఏరియాలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.
News February 24, 2026
గద్వాల: బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి: కలెక్టర్

జిల్లాలో బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ స్మైల్-12 కింద ఈ ఏడాది జనవరిలో 77 మందిని రక్షించామన్నారు. 2019 నుంచి ఇప్పటివరకు మొత్తం 2,323 మంది పిల్లలను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి చేసి పునరావాసం కల్పించామని కలెక్టర్ వివరించారు.
News February 24, 2026
సిద్దిపేట: గర్భిణుల సంరక్షణపై ANMలకు ప్రత్యేక శిక్షణ

సిద్దిపేటలో గర్భధారణ నిర్వహణ నియమాలపై ANMలకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. DMHO డాక్టర్ ధనరాజ్ ఆధ్వర్యంలో ARMMAN సంస్థ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహకారంతో జరిగింది. గర్భిణీ నమోదు నుంచి ప్రసవం వరకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోవడంపై అవగాహన కల్పించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మాతా శిశు మరణాల నివారణకు ANMలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


