News March 27, 2025

నారాయణపేట: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

image

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం పాలమూరు పరిధి MBNR, NRPT, GDWL, NGKL, WNPడీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు. జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్ పై BRS చేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని చెప్పినట్లు సమాచారం. కాగా నేడు డీసీసీలతో ఢిల్లీలో అధిష్ఠానం సమావేశం కానుంది.

Similar News

News December 27, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 27, శనివారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.27 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.44 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.17 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.14 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.50 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.08 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News December 27, 2025

గుంటూరు- కాచిగూడ రైలు వేళల్లో మార్పులు

image

జనవరి 1 నుంచి గుంటూరు-కాచిగూడ రైలు (17251/52) సమయాల్లో మార్పులు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
★ గుంటూరు-కాచిగూడ (17251): సా.5:30కు బదులు ఇకపై 6:40కు గుంటూరులో బయలుదేరి, మరుసటి రోజు ఉ.7:35కు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు రా.11:30కు నంద్యాలకు చేరుకుంటుంది.
★ కాచిగూడ-గుంటూరు (17252): రా.8:45కు కాచిగూడలో బయలుదేరి, మరుసటి రోజు ఉ.10:40కు గుంటూరు చేరుకుంటుంది. ఈ రైలు ఉ.5:20కు నంద్యాలకు వస్తుంది.

News December 27, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.