News January 10, 2026

నారావారిపల్లెలో చంద్రబాబు 4 రోజుల పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు సంక్రాంతి పండుగ పురస్కరించుకొని 4రోజుల పాటు నారావారిపల్లెలో పర్యటించనున్నారు. ఈ నెల 12న తిరుపతి(D) సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ ముగింపు వేడుకలకు హాజరవుతారు. రాత్రికి స్వగ్రామానికి చేరుకొని 13, 14, 15 తేదీల్లో సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించడంతో పాటు శంకుస్థాపనలు చేయనున్నారు. 15న ఉండవల్లిలోని ఇంటికి తిరుగు పయనమవుతారు.

Similar News

News February 13, 2026

సిరిసిల్లలో BRS విజయం, ధర్మపురిలో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్

image

TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో BRS విజయం సాధించింది. ఆ మున్సిపాలిటీలో 39 వార్డులు ఉండగా 27 చోట్ల BRS గెలిచింది. కాంగ్రెస్ 6, బీజేపీ 5, ఇతరులు 1 వార్డు సొంతం చేసుకున్నారు. అటు జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు గెలుచుకుని కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేసింది.

News February 13, 2026

ఆలిండియా రేడియో తొలి తెలుగు మహిళా న్యూస్ రీడర్

image

జోలెపాళ్యం మంగమ్మ 1925 సెప్టెంబర్ 12న మదనపల్లెలో జన్మించారు. ఆలిండియా రేడియో పరీక్షల్లో ఉత్తీర్ణురాలై 1960లో రేడియో తొలి తెలుగు మహిళా న్యూస్ రీడర్, ఎడిటర్‌గా పనిచేశారు. కేంద్ర సమాచారశాఖ, విదేశాంగశాఖల్లో కీలకపదవులతో పాటు పరిశోధనలు, పుస్తక రచనలో అనేక అవార్డులు వరించాయి. ఆంధ్రానైటింగేల్ బిరుదు పొందారు. ఈమెకు తెలుగు, ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఎస్పరాంటో, తమిళ, హిందీ భాషల్లో ప్రావీణ్యం, బోధనలో అనుభవం ఉంది.

News February 13, 2026

జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియాకు షాక్ తప్పదా?

image

T20WCలో పసికూన జింబాబ్వే ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చేలా ఉంది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూలు 5 ఓవర్లలో 34 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయారు. ఇంగ్లిస్, హెడ్, గ్రీన్, టిమ్ డేవిడ్ తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. క్రీజులో మ్యాక్స్‌వెల్, రెన్షా ఉన్నారు. ఆసీస్ విజయానికి 90 బంతుల్లో 136 రన్స్ అవసరం. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.