News January 9, 2026
నార్కట్‌పల్లి: చెరువుగట్టు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష

ప్రముఖ పుణ్యక్షేత్రం చెరువుగట్టులో జనవరి 23 నుంచి 30 వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులు, ప్రజాప్రతినిధులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొని ఏర్పాట్లపై చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
Similar News
News January 27, 2026
మున్సిపల్ పోరుకు సిద్ధం కావాలి: కలెక్టర్

నల్లగొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్‌ఈసీ రాణి కుమిదిని, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్ ఆర్డీవోలు, కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు.
News January 27, 2026
NLG: మోగిన ఎన్నికల నగారా… రేపటి నుంచే నామినేషన్ల స్వీకరణ

మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో నల్గొండ కార్పొరేషన్‌లో ఎన్నికల సందడి మెుదలైంది. రేపటి నుంచి ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నల్గొండ కార్పొరేషన్‌లో మొత్తం 48 డివిజన్లలో 1,42,437 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 73,507 మంది మహిళలు, 68,874 మంది పురుషులు, 56 మంది ఇతరులు ఉన్నారు. మేయర్ స్థానం జనరల్ మహిళకు కేటాయించారు.
News January 26, 2026
మదర్ డెయిరీలో ముదిరిన సంక్షోభం

నల్గొండ జిల్లాలోని మదర్ డెయిరీలో పాలకవర్గ వివాదాలు, ఆర్థిక ఇబ్బందులు పరాకాష్టకు చేరుకున్నాయి. 15 రోజుల్లోనే ఇద్దరు ఛైర్మన్లు రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. తాజా పరిణామాలతో మందడి ప్రభాకర్ రెడ్డి తన ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. డెయిరీకి ఉన్న ₹28 కోట్ల అప్పు విషయంలో బ్యాంకులు సీరియస్ అయ్యాయి. ఫిబ్రవరి 1 లోగా ₹10 కోట్లు చెల్లించకుంటే డెయిరీని సీజ్ చేస్తామని హెచ్చరించాయి.


