News December 17, 2025

నార్త్‌లో ఎందుకు.. సౌత్‌లో వేదికల్లేవా? ఫ్యాన్స్ ఫైర్

image

పొగమంచుతో 4వ టీ20 రద్దు కావడంపై ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. శీతాకాలంలో పొగమంచు కురిసే నార్త్ స్టేట్స్‌లో మ్యాచ్‌లు షెడ్యూల్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మంచు సమస్య ఉండే వేదికల్లో రాత్రి 7గంటలకు కాకుండా మధ్యాహ్నం మ్యాచ్‌లు నిర్వహిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో పొగమంచు సమస్య తక్కువని ఇక్కడ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించే ఛాన్స్‌లు పరిశీలిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

Similar News

News December 22, 2025

ఫాక్స్‌కాన్ రికార్డు.. ఏడాదిలో 30 వేల మందికి ఉద్యోగాలు!

image

బెంగళూరులోని ఫాక్స్‌కాన్ 2025లో రికార్డు స్థాయిలో 30 వేల మందిని రిక్రూట్ చేసుకుంది. వీరిలో 80% మంది మహిళలే. ఇండియాలో ఐఫోన్ల అసెంబ్లీకి కేంద్రంగా ఉన్న ఈ కంపెనీలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక్కడి నుంచే ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లు ఎగుమతి అవుతున్నాయి. నవంబరులో యాపిల్ ఏకంగా 2 బి.డాలర్లు విలువ చేసే ఫోన్లను ఇండియా నుంచి ఎక్స్‌పోర్ట్ చేసింది.

News December 22, 2025

ISRO ప్రొపల్షన్ కాంప్లెక్స్ 100పోస్టులకు నోటిఫికేషన్

image

<>ఇస్రోకు<<>> చెందిన ప్రొపల్షన్ కాంప్లెక్స్ సెంటర్ 100 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BE, B.Tech, BA, BSc, BCom, డిప్లొమా అర్హతగల వారు JAN 10, 11 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. గ్రాడ్యుయేట్లకు గరిష్ఠ వయసు 28ఏళ్లు, టెక్నీషియన్‌లకు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.9వేలు, డిప్లొమా విద్యార్థులకు రూ.8వేలు చెల్లిస్తారు. www.iprc.gov.in

News December 22, 2025

మొటిమల మచ్చలు తగ్గట్లేదా?

image

వాతావరణం, హార్మోన్ల మార్పుల వల్ల చాలామంది అమ్మాయిలు మొటిమలతో బాధపడుతుంటారు. మొటిమలు, వాటి వల్ల వచ్చిన నల్లటి మచ్చలు తగ్గించడానికి చింతపండు ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. చింతపండు గుజ్జులో ముల్తానీ మట్టి, రోజ్ వాటర్, పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. పావుగంట తర్వాత ముఖాన్ని కడిగితే చాలు. అలాగే చింతపండు గుజ్జులో అరటిపండు, శెనగపిండి కలిపి ముఖానికి రాస్తే చర్మం క్లీన్ అవుతుంది.