News December 27, 2024
నార్నూర్: కేజీబీవీ తనిఖీ చేసిన ఎంఈఓ
నార్నూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను శుక్రవారం మండల విద్యాశాఖాధికారి పవార్ అనిత తనిఖీ చేశారు. అనంతరం బోధన సిబ్బంది రికార్డులను పరిశీలించి విద్యార్థులకు పాఠం నేర్పించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భోజనాన్ని అందించాలన్నారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులపై దృష్టి పెట్టాలని, పరీక్షల్లో ఉన్నత స్థాయిలో నిలవాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
Similar News
News December 28, 2024
బెల్లంపల్లి: హత్యకు ప్రయత్నించిన ఐదుగురి రిమాండ్
పాత పగలు మనసులో ఉంచుకొని పథకం ప్రకారం ఒకరిని హత్యకు ప్రయత్నించిన 5గురు నేరస్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు రూరల్ CIఅబ్సలుద్దీన్ తెలిపారు.CIవివరాల ప్రకారం..ఈనెల 24న బాధితుడు పురుషోత్తం కాగజ్ నగర్ నుంచి మంచిర్యాలకు కారులో వెళుతుండగా ముగ్గురిలో ఒక వ్యక్తి బెల్లంపల్లి వద్ద కారు ఆపి పురుషోత్తంను బండరాళ్లతో తలమీద బాది పారిపోయారు. నేడు తాండూరులో నిందితులను పట్టుకొని రిమాండ్ కు తరలించామన్నారు.
News December 28, 2024
MNCL: జిల్లాలో 61452.920 మె.టల ధాన్యం కొనుగోలు
మంచిర్యాల జిల్లాలో ఇప్పటి వరకు 61452.920 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు అదనపు కలెక్టర్ మోతిలాల్ తెలిపారు. ఇందులో 18082.120 మె.టల సన్నలు ఉన్నట్లు పేర్కొన్నారు. నేటికీ రూ.76.23 కోట్లు 5,144 మంది రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు పూర్తి చేసిన 69 కొనుగోలు కేంద్రాలను మూసివేయడం జరిగిందన్నారు. అకాల వర్షాలకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News December 27, 2024
ఆదిలాబాద్: కేయూ పరిధిలో పరీక్షలు వాయిదా
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దృష్ట్యా కాకతీయ యూనివర్సిటీ యూనివర్సిటీ పరిధిలో నేడు జరగాల్సిన పరీక్షలకు వాయిదా వేస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నేడు ఉదయం జరగాల్సిన డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్ష, మధ్యాహ్నం జరగాల్సిన 1వ సెమిస్టర్ పరీక్ష వాయిదా వేశారు. ఈ పరీక్షలు డిసెంబర్ 31 మంగళవారం జరుగుతాయని స్పష్టం చేశారు. కావున ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.