News January 23, 2025
నార్నూర్ ప్రమాద ఘటనలో మరొకరు మృతి

నార్నూర్ మండలంలోని మాలేపూర్ ఘాట్ వద్ద ఐచర్ వాహనం ఆదివారం అదుపు తప్పిన ఘటనలో ఇప్పటికే ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 47 మందికి గాయాలు కాగా వారు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందగా, తాజాగా ఇంద్రవెల్లి మండలం చిత్తగూడ గ్రామనికి చెందిన ఆత్రం మల్కుబాయి (55) హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం మరణించారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది.
Similar News
News September 18, 2025
HNK: కొడుకును సమర్థించారు.. కటకటాల పాలయ్యారు!

హనుమకొండ జిల్లా వేలేరు మండలానికి చెందిన తరుణ్, రాజులు ఓ గ్రామానికి చెందిన బాలికకు సైగలు చేస్తూ వేధించేవారు. నిందితుల తల్లిదండ్రులకు చెప్పగా వారి కొడుకులను సమర్థించారు. దీంతో బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో సమ్మయ్య, ఇందిరమ్మలతో కలిపి నలుగురిపై పోక్సో కేసు నమోదైంది. మూడేళ్ల జైలు, రూ.12వేల జరిమానా వేస్తూ HNK జిల్లా మొదటి అదనపు సెషన్స్ జడ్జి అపర్ణ దేవి తీర్పు ఇచ్చారు.
News September 18, 2025
బాల్మర్ లారీలో ఉద్యోగాలు

<
News September 18, 2025
జగన్ అసెంబ్లీకి వస్తారా?

AP: నేటి నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ చీఫ్ జగన్ హాజరవుతారా అనేదానిపై సస్పెన్స్ నెలకొంది. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆయన కోరుతుండగా కూటమి ప్రభుత్వం మాత్రం అర్హత లేదని చెబుతోంది. అటు అసెంబ్లీకి వెళ్లొద్దని YCP ఎమ్మెల్యేలను జగన్ ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఎప్పటిలాగే పార్టీ నుంచి మండలి సభ్యులే హాజరవుతారని తెలుస్తోంది. దీనిపై మరికాసేపట్లో క్లారిటీ రానుంది.