News March 31, 2025

నార్నూర్: వచ్చే నెలలో పెళ్లి.. ఉగాది రోజే మృతి

image

నార్నూర్ మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన పవార్ సంగీత-ఉత్తమ్ దంపతుల కుమారుడు పవార్ శంకర్(22) ఆదివారం కెరమెరిలోని శంకర్ లొద్ది పుణ్య క్షేత్రానికి వెళ్లి వాగులో <<15940359>>ఈతకు వెళ్లి<<>> మృతిచెందాడు.  శంకర్ ఉగాది రోజే మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కాగా ఏప్రిల్‌లో అతడికి పెళ్లి నిర్ణయించినట్లు స్థానికులు తెలిపారు. 

Similar News

News November 4, 2025

మహిళలు, బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి: ఆదిలాబాద్ ఎస్పీ

image

మహిళలు, విద్యార్థినుల రక్షణ, భద్రతపై జిల్లా పోలీసుల ప్రత్యేక దృష్టి సారిస్తోందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని స్థానిక సాంఘిక సంక్షేమ కళాశాల, పాఠశాలలో “పోలీస్ అక్క” కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని పాఠశాల,కళాశాలను మహిళ పోలీసు సందర్శించాలని సూచించారు. పోలీస్ ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

News November 4, 2025

ఆదిలాబాద్: మంత్రి పొన్నంను కలిసిన జిల్లా గౌడ సంఘం నేతలు

image

రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను జిల్లా గౌడ సంక్షేమ సభ్యులు కలిశారు. మంగళవారం హైదరాబాద్‌లో మంత్రిని కలిసి గౌడ కులస్థుల సమస్యలు, గౌడ కమ్యూనిటీ హాల్, వసతి గృహం ఏర్పాటు గురించి విన్నవించారు. ప్రభుత్వం గౌడ్ల సమస్యలు, బీసీ రిజర్వేషన్ల సాధన, కుల గణన వంటి అంశాలపై కృషి చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. రమేశ్ చందర్ గౌడ్, సత్యనారాయణ గౌడ్, నాందేవ్, లక్ష్మీనారాయణ, చరణ్ గౌడ్ ఉన్నారు.

News November 4, 2025

ఆదిలాబాద్: ఈనెల 6 నుంచి జిన్నింగ్ మిల్లుల మూసివేతపై కలెక్టర్ సమీక్ష

image

రాష్ట్రంలోని జిన్నింగ్ మిల్లులు నవంబర్ 6 నుంచి నిరవధికంగా మూసివేయనున్నట్లు తెలంగాణ కాటన్ జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగ అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం సీసీఐ, జిన్నింగ్ మిల్లుల యజమానులు, మార్కెటింగ్, వ్యవసాయ, రవాణా, అగ్నిమాపక తదితర శాఖల అధికారులతో పత్తి కొనుగోళ్లపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.