News January 17, 2026
నార్వే అమ్మాయి వెడ్స్ వైజాగ్ అబ్బాయి

మన వైజాగ్ కుర్రాడు నార్వే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకుంటున్నాడు. శుక్రవారం వీరి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. NAD కొత్తరోడ్డు ప్రాంతానికి చెందిన సైమన్ గొట్టిపల్లి తొమ్మిదేళ్ల క్రితం నార్వేలో బ్యాంక్ జాబ్ కోసం వెళ్లాడు. అక్కడ లాంగ్వేజ్ నేర్చుకుంటుండగా.. నార్వేజియన్ దేశానికి చెందిన టోరా ఓయిమ్ పరిచయమయింది. పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇరువురు తమ కుటుంబ సభ్యులకు చెప్పి వివాహానికి ఒప్పించారు.
Similar News
News February 11, 2026
VJA: బుడమేరు ప్రక్షాళన నిధులెక్కడ?

విజయవాడ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశంలో బుడమేరు ప్రక్షాళన నిధులపై వైసీపీ సభ్యులు కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రక్షాళనకు ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడుతూ, PPP విధానంలో డ్రెయిన్ల నిర్మాణాన్ని తిరస్కరిస్తూ తీర్మానం చేశారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులు సరైన కౌంటర్ ఇవ్వలేకపోయారని, ప్రభుత్వం చేపట్టిన పనులను, కేంద్ర సాయం అంశాలను ప్రస్తావించడంలో విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తాయి.
News February 11, 2026
నవజాత శిశువుల్ని ఇలా రక్షిద్దాం..

నవజాత శిశువుల్లో 80 శాతం మంది నెలలు వివిధ కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని యునిసెఫ్ నివేదిక తెలిపింది. వీటిని నివారించడానికి న్యూ బోర్న్ స్క్రీనింగ్ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. పుట్టిన 48-96 గంటల మధ్య ఈ పరీక్ష చేస్తారు. శిశువు మడమ నుండి రక్త నమూనాలను సేకరించి పరీక్షిస్తారు. దీనివల్ల వ్యాధులను ముందుగా గుర్తించడం వల్ల శారీరక, మానసిక వైకల్యాలతో సహా ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చు.
News February 11, 2026
టారిఫ్‌లే అస్త్రంగా భారత్-పాక్ యుద్ధాన్ని ఆపేశా: ట్రంప్

భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ మరోసారి అన్నారు. ఇరుదేశాలు దాదాపు అణు యుద్ధం దిశగా సాగాయని చెప్పుకొచ్చారు. టారిఫ్‌లను అస్త్రంగా వాడి ఘర్షణల్ని నివారించినట్లు చెప్పారు. తన మధ్యవర్తిత్వం వల్ల దాదాపు కోటి మందికి చావు తప్పిందని స్వయంగా పాక్ ప్రధాని చెప్పినట్లు తెలిపారు. ఇరు దేశాల ఘర్షణల్లో దాదాపు 10 విమానాలు కుప్పకూలినట్లు చెప్పారు. మనుషులు చనిపోవడం ఇష్టంలేకే యుద్ధాల్ని ఆపానన్నారు.


